దశాబ్దంన్నర కిందట తెలుగులో సూపర్ హిట్టయిన సినిమా వర్షం. ఆ చిత్రం పలు భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో వచ్చిన 12 ఏళ్ల తర్వాత ఈ చిత్రం హిందీలో బాగి పేరుతో రీమేక్ కావడం విశేషం. ఐతే తెలుగు వెర్షన్‌తో పోలిస్తే పూర్తిగా స్టైల్ మార్చి హిందీలో సినిమా తీశారు. ఈ చిత్రంతోనే టైగర్ ష్రాఫ్ స్టార్ అయ్యాడు. అందులో మన సుధీర్ బాబు విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా సరే.. కలెక్షన్లకు ఢోకా లేకపోయింది. సినిమా హిట్టయింది. దీంతో దీన్నొక ఫ్రాంఛైజీగా మార్చేసి వరుసగా సినిమాలు తీసేస్తున్నారు. క్షణం లాంటి క్లాస్ థ్రిల్లర్ మూవీని పూర్తిగా మాస్ యాక్షన్ మూవీగా మార్చేసి బాగి-2 తీశారు. దానికీ వసూళ్లు బాగానే వచ్చాయి. దీంతో ఇంకో సీక్వెల్ లైన్లో పెట్టారు. అదే బాగి-3.
ఈసారి కూడా రీమేక్ సినిమానే ఎంచుకుని దానికి డిఫరెంట్ టచ్ ఇచ్చారు. తమిళంలో విజయవంతమైన వేట్టై చిత్రానికి చిత్ర విచిత్రమైన మార్పులు చేసి బాగి-3గా వదిలితే దానికీ వసూళ్ల విషయంలో ఢోకా లేకపోయింది. ఇప్పుడీ సిరీస్‌లో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు అహ్మద్ ఖాన్, సాజిద్ నడియాడ్ వాలా.
ఈ ఏడాది చివర్లోనే బాగి-4 పట్టాలెక్కబోతోంది. టైగర్ ష్రాఫే హీరో. ఇది కూడా పూర్తి స్థాయి యాక్షన్ మూవీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి కూడా ఏదో భాషలో ఒక రీమేక్ మూవీనే ఎంచుకుని ఉంటారు. దాని రూపురేఖలు మార్చేసి బాగి-4 అంటారు. సినిమా రిలీజయ్యే ముందు వరకు ఆ రీమేక్ ఏది అన్నది చెప్పరు. రిలీజయ్యాక ఒరిజినల్ తీసిన వాళ్లు చూసి షాకవ్వడమే ఉంటుంది. మన వర్షం రీమేక్‌తో మొదలైన ప్రయాణం ఇన్ని మలుపులు తిరుగుతుండటం విశేషమే.
This post was last modified on October 29, 2020 5:22 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…