ఒకప్పుడు అపరిచితుడు టైంలో విక్రమ్ సినిమాల ఓపెనింగ్స్ కి ట్రేడ్ మతులు పోయేవి. తర్వాత వచ్చే వాటికి డిమాండ్ పెరిగి డిస్ట్రిబ్యూటర్లు అత్యధిక రేట్లు ఆఫర్ చేసేవాళ్ళు. ఈ హవా కొంతకాలం కొనసాగింది. ముఖ్యంగా ఐ వచ్చినప్పుడు మొదటి రోజు చాలా సెంటర్లలో రికార్డు నెంబర్లు నమోదు కావడం థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేసినవాళ్లకు గుర్తే. కానీ అదంతా గతం. ఇప్పుడు విక్రమ్ మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. పొన్నియిన్ సెల్వన్ తమిళంలో అంత పెద్ద విజయం సాధించినా తెలుగులో మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. తంగలాన్ రెండు రోజులు హడావిడి చేసి తర్వాత ఆగిపోయింది.
గురువారం వీరధీరశూర పార్ట్ 2 వస్తోంది. బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ప్రమోషన్లు కూడా ఒక రోజు విక్రమ్ టీమ్ వచ్చి మీడియాని కలిసి, ప్రెస్ మీట్ చేసి, ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేకపోయింది. తమిళంలో బుకింగ్స్ కూడా భీభత్సంగా లేవు. ఉన్నంతలో మెల్లగా ఊపందుకుంటున్నాయి. ఎల్2 ఎంపురాన్ దెబ్బకు కేరళ, కర్ణాటకలో విక్రమ్ కు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. మన దగ్గరేమో మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ వల్ల ఎక్కువ థియేటర్లు దొరకడం అనుమానంగా ఉంది. కాకపోతే మార్చి 27 గురువారం రావడం వల్ల ఒక రోజు ఎక్కువ స్క్రీన్లలో వేసుకునే ఛాన్స్ దక్కింది.
ఏదైనా చాలా బాగుందనే టాక్ వస్తే తప్ప వీరధీరశూర పార్ట్ 2 అద్భుతాలు చేయడం కష్టమే. ఒక రాత్రి జరిగే సంఘటనల చుట్టూ విక్రమ్, ఎస్జె సూర్య, సూరజ్ పాత్రల మధ్య విలేజ్ డ్రామాగా దర్శకుడు అరుణ్ కుమార్ దీన్ని రూపొందించారు. ఇతగాడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. కాకపోతే రిలీజ్ టైమింగ్ తేడా కొడుతోందని చియాన్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఒక వారం పది రోజులు ముందే వచ్చి ఉంటే సోలో రిలీజ్ తో వసూళ్లు దక్కేవని, ఇప్పుడు మరో నాలుగు సినిమాలతో పంచుకునే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. మరి విక్రమ్ అంతగా నమ్ముకున్న ఈ వీరుడు ధీరుడు ఏం చేస్తాడో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on March 25, 2025 9:59 pm
ఏపీలో గురువారం వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్…
టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో ఏపీకి మహార్దశ పట్టిందనే చెప్పాలి. ఇప్పటికే గడచిన 9 నెలల కూటమి పాలనలోనే…
సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా యాభైకి పైగా కథలు విని…
అల్లు అర్జున్ తో ప్యాన్ ఇండియా మూవీ లాక్ కాకముందు దర్శకుడు అట్లీ ప్లాన్ చేసుకున్నది సల్మాన్ ఖాన్ తో…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు మంచి కసి మీదున్నారు. గేమ్ ఛేంజర్ పెద్ద దెబ్బ కొట్టడంతో ఎలాగైనా ఆర్సి…
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాలు చేసే విషయంలో తగినంత సమయం దొరక్క బ్యాలన్స్…