రాబిన్ హుడ్ టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జిఓ బయటికి వచ్చాక దాని మీద పెద్ద చర్చే జరిగింది. నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరో నటించిన సినిమాకు అసలు హైక్ ఎందుకనే కోణంలో నెటిజెన్లు డిస్కషన్ పెట్టారు. అందులోనూ ఇది వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్యాన్ ఇండియా మూవీ కానప్పుడు ప్రత్యేక వెసులుబాటు ఎందుకనేది అందరి మదిలో మెదిలిన ప్రశ్న. బడ్జెట్ కొంచెం ఎక్కువ అయ్యుండొచ్చు. హిట్ అయితే ఎలాగూ అంతకంతా వెనక్కు వస్తుంది కాబట్టి సాధారణ రేట్లతో వినోదాన్ని అందివొచ్చు కదానే కోణంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దీనికి మైత్రి నిర్మాతలు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కేవలం ప్రీమియం లొకేషన్లకు మాత్రమే పెంపు ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో సాధారణ రేట్లే అందుబాటులో ఉంటాయని అఫీషియల్ ట్వీట్ పెట్టింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రీమియం ఊళ్లు అంటే నగరాలా లేక జిల్లా కేంద్రాలా లేక భారీ జనాభా ఉండే పెద్ద పట్టణాలా. ఈ పాయింట్ మీద క్లారిటీ లేదు. అలా అనుకుంటే విజయవాడ, వైజాగ్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు లాంటి కేంద్రాలను ఈ క్యాటగిరీకి తెస్తారేమో. అయినా సరే ఇక్కడ కూడా సామాన్య ప్రేక్షకులు ఉంటారుగా. మరి వాళ్ళ సంగతేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఏదైతేనేం మొత్తానికి రాబిన్ హుడ్ టీమ్ ఎక్కువ చోట్ల హైక్ ఉండదనే మాట చెప్పడం సంతోషం. ఇంకా చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. ఈ ఇష్యూ వల్లే కొంత ఆలస్యం అయ్యిందని సమాచారం. ఇప్పుడు తీరిపోయింది కాబట్టి మొత్తం ఆన్ లైన్ అమ్మకాలు ఓపెనయ్యాక ఏవి ప్రీమియం సెంటర్స్ అనేది బయటికి వస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ మీద మంచి అంచనాలున్నాయి. అన్నట్టు మ్యాడ్ స్క్వేర్ కూడా రాబిన్ హుడ్ తరహాలో టికెట్ పెంపు మోడల్ ఎంచుకుందనే టాక్ వచ్చింది కానీ ఇప్పటికైతే జిఓ, అధికారిక సమాచారం లాంటివి లేవు. సో వెయిటింగ్ తప్పదు.
This post was last modified on March 25, 2025 4:19 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…