Movie News

పెద్దాయన క్షమాపణ…ఇక వదిలేయొచ్చు

ఇటీవలే జరిగిన రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో చిన్న పాత్ర చేసిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని ఉద్దేశించి అన్న మాటల మీద నెగటివ్ కామెంట్స్ గట్టిగానే వినిపించాయి. ఆయనేదో చనువుగా అన్నా అది కోట్లాది మంది వీడియోల్లో చూసే పబ్లిక్ స్టేజి కావడంతో రీచ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అందులోనూ రాజేంద్రుడు ఏనాడూ అలా నోరుజారిన సందర్భాలు లేవు. ఎంతసేపు నటన గురించి, చిత్రాల్లో తన పాత్రల గురించి చెప్పుకుంటారు తప్పించి వ్యంగ్యంగా అయినా సరే ఇబ్బంది పడే కామెడీ చేయడం అరుదు. అనుకోకుండా అది రాబిన్ హుడ్ వేడుకలో జరిగిపోయింది.

వచ్చిన స్పందన గమనించిన రాజేంద్రుడు తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. నితిన్ లాగే డేవిడ్ వార్నర్ కూడా తన బిడ్డ లాంటి వాడని, ఈవెంట్ కు ముందు బోలెడు అల్లరి చేసుకున్నామని, పరస్పరం సినిమాల్లో క్రికెట్ లో రా చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుకున్నామని, ఆ చనువుతోనే అలా అన్నాను తప్పించి వేరే దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు ఇకపై ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. హర్ట్ అయిన డేవిడ్ వార్నర్ అభిమానులు శాంతించవచ్చు.

ఒకప్పుడంటే ఏమో కానీ ఇప్పుడు ఈవెంట్లో ఎదైనా మాట్లాడితే లైవ్, ఆ తర్వాత ఫుటేజ్ రూపంలో శాశ్వతత్వం సంపాదించుకుంటోంది. అందుకే ఏదైనా అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొన్నేళ్ల క్రితం ఒక సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు యాంకర్ ని ఉద్దేశించి అన్న మాట ఏకంగా మహిళా సంఘాలు కోర్టు కేసు పెట్టే దాకా వెళ్ళింది. తర్వాత ఆయన సారీ చెప్పడం, సద్దుమణగడం జరిగాయి. ఎక్కడిదాకో ఎందుకు ఆ మధ్య తండేల్ ఈవెంట్ లో అల్లు అరవింద్ తన మేనల్లుడు సినిమా గేమ్ ఛేంజర్ గురించి వేసిన జోక్ పెద్ద రచ్చ చేసి ఆయనతోనూ క్షమాపణ చెప్పించింది. అందుకే పెద్దలు జాగ్రత్తగా ఉండాలనేది.

This post was last modified on March 25, 2025 4:09 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

1 minute ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

2 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

5 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

6 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

7 hours ago