ఈ వారం విడుదల కాబోతున్న ఎల్2 ఎంపురాన్ మొదటి భాగం లూసిఫర్ ని తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో భారీగానే చూశారు. చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ ని ఇష్టపడే టాలీవుడ్ ఆడియన్స్ ఎందరో. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ వెనుక చాలా పెద్ద కథే ఉందండోయ్. ప్రమోషన్ల సందర్భంగా అది బయటికి వచ్చింది. అదేంటో చూద్దాం. 2012లో రాజేష్ పిళ్ళై అనే దర్శకుడు లూసిఫర్ పేరుతో ఒక కథ రాసుకుని మోహన్ లాల్ కి వినిపించారు. రచయిత మురళి గోపితో కలిసి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. టైటిల్ రిజిస్టర్ చేసి ప్రాజెక్టుని మీడియా ముందు అనౌన్స్ చేశారు.
అప్పటికే కుంచకో బోబన్ తో మోటార్ సైకిల్ డైరీస్ తీస్తున్న రాజేష్ పిళ్ళై అది పూర్తి చేసేందుకు సమయం అవసరం కావడంతో దాంట్లో బిజీ అయిపోయారు. అదయ్యాక కూడా లూసిఫర్ కార్యరూపం దాల్చలేదు. అటుపక్క గోపి మురళి రైటర్ గా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. కట్ చేస్తే 2016లో రాజేష్ పిళ్ళై అనారోగ్యంతో చనిపోయారు. అలా లూసిఫర్ ఆగిపోయింది. కొంత కాలం తర్వాత టైటిల్ మాత్రమే తీసుకుని పూర్తిగా వేరే కథని తయారు చేశారు గోపి మురళి. వినగానే మోహన్ లాల్ కు నచ్చేసింది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయం చేద్దామని స్వంత బ్యానర్ మీద నిర్మించేందుకు రెడీ అయ్యారు.
స్క్రిప్ట్ పనుల కోసం కోచిలో ఒక ఫ్లాట్ కొన్న పృథ్విరాజ్ వర్క్ మొత్తం అక్కడే చేయించి 2018లో లూసిఫర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. తర్వాత ఏడాదికి రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంది. 30 కోట్లతో తీస్తే వంద కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిపించింది. అయితే చనిపోయిన రాజేష్ పిళ్ళై అనుకున్న లూసిఫర్ కథ వేరని, కేవలం పేరు మాత్రమే తీసుకుని స్వంతంగా స్టోరీ సిద్ధం చేసుకున్నామని గోపి మురళి, పృథ్విరాజ్ వెర్షన్. ఏది ఏమైనా మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో సినిమా తీయాలని కలలు కన్న దర్శకుడు హఠాన్మరణం చెందడం, అది వేరొకరి చేతికి వెళ్లి చరిత్ర సృష్టించడం విధి లిఖితం. సినిమాని మించిన డ్రామా అంటే ఇదేనేమో.
This post was last modified on March 24, 2025 5:37 pm
ఏపీలో వైసీపీ పాలన, కూటమి పాలనల్లోని వ్యత్యాసాలను ఎత్తి చూపారు ఓ ఉద్యోగి. అంతేనా నాటి ప్రభుత్వ పాలనలో తామెలాంటి…
రాబిన్ హుడ్ టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జిఓ బయటికి వచ్చాక దాని…
ఇటీవలే జరిగిన రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో చిన్న పాత్ర…
ఎల్లుండి రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఒక క్రేజీ కంటెంట్ ఆశిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆర్సి…
గెడ్డం ప్రసాద్ కుమార్… తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత. ఆది నుంచి…
ఇప్పట్లో మొదలవ్వకపోయినా అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ గురించి అప్పుడే ఓ…