ఈ రోజు మెగా బ్రదర్ నాగబాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి సర్ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్‌లు ఇచ్చారు. ‘‘Happy Birthday to my passionately loyal, emotional, kind hearted and fun loving brother @NagaBabuOffl Have a great year ahead! మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను’’ అంటూ ఎంతో ఆత్మీయంగా తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి అతణ్ని ఆనందంలో ముంచెత్తారు.
ఆ తర్వాత నాగబాబు తన పుట్టిన రోజు సందర్భంగా ఓ మంచి పని చేస్తుంటే అక్కడ హఠాత్తుగా ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచారు. గత నెలలో కరోనా బారిన పడి కోలుకున్న నాగబాబు.. ఆ తర్వాత ప్లాస్మా దానం చేసిన సంగతి తెలిసిందే.
తన బాడీలో ఇంకా యాంటీ బాడీస్ ఉండటంతో పుట్టిన రోజును పురస్కరించుకుని నాగబాబు గురువారం మరోసారి ప్లాస్మా దానం చేశారు. ఈ సంగతి చిరుకు తెలియడంతో వెంటనే బయల్దేరి ఆసుపత్రికి వెళ్లిపోయారు. తన తమ్ముడిని సర్‌ప్రైజ్ చేశారు. చిరు చెప్పాపట్టకుండా తాను ప్లాస్మా దానం చేస్తున్న ఆసుపత్రికి వచ్చి తనను ఆనందంలో ముంచెత్తాడని నాగబాబు ట్విట్టర్లో వెల్లడించాడు.
చిరు తన ఫిలాసఫర్ అని.. ఆయన లాంటి సోదరుడిని కలిగి ఉండటం తన అదృష్టమని నాగబాబు అన్నారు. ప్లాస్మా దానం మీద చిరు ముందు నుంచి జనాల్లో అవగాహన పెంచడానికి గట్టి ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులతో కలిసి కూడా పని చేశారాయన. ఆయన ప్రయత్నానికి తన వంతుగా తోడ్పాటు అందించడం ఆనందంగా ఉందన్న నాగబాబు.. ఎప్పటికీ అన్నయ్యకు తోడుగా ఉంటానని పుట్టిన రోజు నాడు మరోసారి ప్రతినబూనారు.
This post was last modified on October 29, 2020 2:08 pm
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…
త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడి రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ బీజేపీ…