ఈ నెలాఖరు బాక్సాఫీస్ కు చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఉగాది, రంజాన్ పండగలు రెండూ ఒకేసారి రావడమే కాక పాంచ్ పటాకా టైపు లో అయిదు సినిమాలు థియేటర్లకు విచ్చేస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంటుందని ఎగ్జిబిటర్లు ఎదురు చూస్తున్నారు. తేదీల ప్రకారం చూసుకుంటే ముందుగా మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ మార్చి 27 దిగుతోంది. భాషల సంగతి పక్కనపెడితే అడ్వాన్స్ బుకింగ్స్ షాకిచ్చే రేంజ్ లో జరుగుతున్నాయి. మలయాళం వెర్షన్ అమ్మకాలు భీభత్సంగా ఉండగా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు కంటెంట్ మీద నమ్మకంతో ఏపీ, తెలంగాణలో మంచి రిలీజ్ కు సహకరిస్తున్నారు.
అదే రోజు విక్రమ్ ‘వీరధీరశూర పార్ట్ 2’ వస్తోంది. బజ్ పరంగా వెనుకబడినప్పటికీ మూవీ చూసాక సర్ప్రైజ్ అవుతారని టీమ్ నమ్ముతోంది. మార్కెటింగ్ పరంగా తమిళ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు కాని టాక్ బాగుంటే మన ఆడియన్స్ కూడా చూస్తారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇక మరుసటి రోజు మార్చి 28 నితిన్ ‘రాబిన్ హుడ్’ మీద పెద్ద అంచనాలే ఉన్నాయి. నితిన్ కామెడీ టైమింగ్, కేతిక శర్మ ఐటెం సాంగ్, శ్రీలీల గ్లామర్, డేవిడ్ వార్నర్ క్యామియో, వెంకీ కుడుముల హాస్యం వెరసి అన్నివర్గాలను టార్గెట్ చేసుకుని వస్తోంది. మైత్రి ప్రొడక్షన్ కావడం వల్ల పెద్ద ఎత్తున మార్కెటింగ్ తో ఆడియన్స్ కి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ‘మ్యాడ్ స్క్వేర్’ మీద యూత్ లో హైప్ తెలిసిందే. పైన చెప్పిన వాటికంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో వేగంగా బుకింగ్స్ జరుగుతోంది ఈ సినిమాకే. వెరైటీ ఇంటర్వ్యూలతో మెల్లగా అంచనాలు పెంచేస్తున్నారు. తమన్ బిజిఎం రూపంలో మరో ఆకర్షణ తోడయ్యింది. తర్వాత రెండు రోజుల గ్యాప్ తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ వచ్చేస్తాడు. ఇప్పటిదాకా టీజర్, పాటలు, ట్రైలర్ అమాంతం అంచనాలు పెంచలేదు కానీ మాస్ మసాలా సరిగ్గా కుదిరితే భాయ్ రికార్డులు కొట్టేస్తాడు. కాకపోతే హిందీ వెర్షన్ ఒకటే కాబట్టి దీని ప్రభావం మల్టీప్లెక్సుల వరకు ఎక్కువగా ఉంటుంది. చూడాలి మరి ఎవరు విన్నర్సో ఎవరు లూజర్సో.
This post was last modified on March 24, 2025 1:42 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…