తమిళ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘ఖైదీ’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ‘ఖైదీ-2’ రాబోతున్నట్లు కొన్నేళ్ల ముందే ప్రకటించారు. కానీ అదేమీ సీక్వెల్ కాదు. ప్రీక్వెల్. ‘ఖైదీ’ చిత్రంలో హీరో చాలా ఏళ్లు జైల్లో గడిపి బయటికి వచ్చిన దగ్గర్నుంచి కథ మొదలవుతుంది. ఎక్కడా అతడి గతంలో ఏం జరిగిందో చూపించరు. ‘ఖైదీ-2’లో చూపించబోయేది ఆ కథే. తన నేపథ్యంతో మొదలుపెట్టి జైలుకు వెళ్లడానికి దారి తీసిన పరిస్థితుల నేపథ్యంలోనే ఆ కథ నడుస్తుందని లోకేష్ ఇంతకుముందే హింట్ ఇచ్చాడు. ఇలా వర్తమానంలో ఓ కథను చూపించాక.. వెనక్కి వెళ్లి ఫ్లాష్ బ్యాక్ స్టోరీని రెండో భాగంలో చూపించడం అరుదైన విషయమే.
ఐతే ‘ఖైదీ-2’ రాకముందే మరో చిత్రంలో ఈ ప్రయోగం జరగబోతోంది. ఆ చిత్రమే.. వీర ధీర శూర. విక్రమ్ హీరోగా అరుణ్ కుమార్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పార్ట-2 పేరుతో రిలీజ్ చేస్తుండడం విశేషం. ఇలా పార్ట్-2 అని తొలి సినిమాను రిలీజ్ చేయడం ఇప్పటిదాకా ఎవరూ చేసి ఉండరు. ఈ సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్లో విక్రమ్ మాట్లాడుతూ.. ఇందులో హీరోకు ఒక పెద్ద కథ ఉంటుందని.. ఆ కథను ఈ సినిమాలో చూపించడానికి అవకాశం లేకపోయిందని.. అందుకే తర్వాత పార్ట్-1గా దాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని చెప్పాడు.
చాలా ఏళ్ల నుంచి రకరకాల ప్రయోగాలు చేసి దెబ్బ తిన్న విక్రమ్.. ‘వీర ధీర శూర’ రూపంలో పక్కా కమర్షియల్ మూవీ చేశాడు. ఇది తన ఆకలి తీర్చేలాగే కనిపిస్తోంది. సిద్ధార్థ్‌తో ‘చిన్నా’ సినిమా తీసిన దర్శకుడే దీన్ని రూపొందించాడు. ఇందులో విక్రమ్ కిరాణా కొట్టు నడిపే మామూలు వ్యక్తిగా కనిపించనున్నాడు. హీరో కిరాణా కొట్టు నడపడం ఏంటి.. ఇలాంటి పాత్రలో హీరోయిజం ఎలా సాధ్యం అని సందేహం కలగొచ్చు. ఇందులో హీరోయిజం మామూలుగా ఉండదని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో తెలుగు నటుడు పృథ్వీ ఓ కీలక పాత్ర పోషించగా.. దుషారా విజయ్ కథానాయికగా చేసింది. ఎస్.జె.సూర్య ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
This post was last modified on March 23, 2025 3:05 pm
ఇప్పుడేదో రీ రిలీజుల పేరుతో స్టార్ హీరోల మాస్ సినిమాలను చూసి, అల్లరి చేసి మురిసిపోతున్నాం కానీ నిజమైన క్లాసిక్స్…
ఏపీలో విపక్షం వైసీపీకి చెందిన మరో కీలక నేత, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుదామంటూ ఉత్సాహపడిన మాజీ మంత్రి…
సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వ సాధారణం. దీనికి ఎవరూ మినహాయింపుగా నిలవడం లేదు. కొందరు పోటీ వల్ల అక్కసుతో, మరికొందరు…
ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ పరిస్థితి ఆశించిన దానికంటే పూర్తిగా భిన్నంగా మారిపోయింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కి నాయకత్వం వహించిన…
ఏపీ సీఎం చంద్రబాబు చేపడుతున్న వినూత్న పథకాలు.. కార్యక్రమాలు ఆయనతోపాటు రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి కూడా జోష్ పెంచుతున్నాయి. ఇప్పటికే…
మద్యం కుంభకోణం…దేశ రాజదాని డిల్లీలో ఆప్ సర్కాను కుప్పకూల్చేసింది. ఇటు తమిళనాడులో అదికార డీఎంకేను ఆత్మ రక్షణలో పడేసింది. ఈ…