ఇంకో ఏడాది ఉండగానే 2026 మార్చి బాక్సాఫీస్ పోటీ వేడెక్కిపోతోంది. ప్యాన్ ఇండియా సినిమాలు ఒక్కొక్కటిగా అదే నెలలో వచ్చేందుకు పరుగులు పెడుతుండటంతో కాంపిటీషన్ ఓ రేంజ్ లో ఉండబోతోంది. నిజంగా అన్నీ మాట మీద ఉంటాయా అంటే ఖచ్చితంగా చెప్పలేం. పరిస్థితులు, షూటింగ్ వాయిదాలు, ఆర్టిస్టుల సహకారం ఇలా రకరకాల కారణాలు స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డు పడతాయి. నిన్న యష్ ‘టాక్సిక్’ మార్చి 19 విడుదలవుతుందని ప్రకటించడంతో బాలీవుడ్ వర్గాలు అలెర్టయ్యాయి. ఎందుకంటే రన్బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ అదే రోజు వచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం కావడంతో అంచనాలు మాములుగా లేవు. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన సినిమాల్లో రెగ్యులర్ గా ఉండే రొమాంటిక్ గ్రాండియర్ కాకుండా ఈసారి భారీ యాక్షన్ ఉంటుందట. టాక్సిక్, లవ్ అండ్ వార్ ఒకేరోజు తలపడటం వల్ల ఓపెనింగ్స్ పరస్పరం ప్రభావితం చెందే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక మార్చి 26 ముందే లాక్ చేసుకున్న నాని ‘ది ప్యారడైజ్’ కు పోటీగా రామ్ చరణ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న పేరు) అదే రోజు దింపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వచ్చిన వార్త న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే నానికి ప్యారడైజ్ చాలా ప్రతిష్టాత్మకం.
మొత్తం ఈ నాలుగు సినిమాల బడ్జెట్ లు లెక్కేసుకుంటే అటుఇటుగా ఆరేడు వందల కోట్ల పైమాటే. ఆయా హీరోలకు చాలా ప్రెస్టీజియస్ గా మారినవి. కెజిఎఫ్ తో ఏర్పడిన మార్కెట్ ని కాపాడుకునేందుకు యష్ ఏడాది గ్యాప్ తీసుకుని టాక్సిక్ చేస్తున్నాడు. కమర్షియల్ జానర్ హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోయినా గీతూ మోహన్ దాస్ ని నమ్మాడు. పెద్ది గురించి బుచ్చిబాబు ఇస్తున్న ఎలివేషన్లు మాములుగా లేవు. టీజర్ అరాచకం అనిపించేలా వచ్చిందట. ఇక నాని అన్ని గీతాలు దాటి ది ప్యారడైజ్ లో పూర్తి వయొలెంట్ పాత్ర చేస్తున్నాడు. మండే ఎండల్లో బాక్సాఫీస్ ఏర్పడే మంటలు పన్నెండు నెలల ముందే వేడిని రాజేస్తున్నాయి.
This post was last modified on March 23, 2025 1:07 pm
ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ పరిస్థితి ఆశించిన దానికంటే పూర్తిగా భిన్నంగా మారిపోయింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కి నాయకత్వం వహించిన…
ఏపీ సీఎం చంద్రబాబు చేపడుతున్న వినూత్న పథకాలు.. కార్యక్రమాలు ఆయనతోపాటు రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి కూడా జోష్ పెంచుతున్నాయి. ఇప్పటికే…
మద్యం కుంభకోణం…దేశ రాజదాని డిల్లీలో ఆప్ సర్కాను కుప్పకూల్చేసింది. ఇటు తమిళనాడులో అదికార డీఎంకేను ఆత్మ రక్షణలో పడేసింది. ఈ…
వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్కు మరో ఉచ్చు బిగిసుకుంది. తాజాగా హైకోర్టు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'తాము…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఒక్కసారి చెబితే నిజంగానే వంద సార్లు చెప్పినట్టే. అదేదో సినిమా డైలాగ్…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమైందా? ఆ దిశగా వడివడిగా చర్యలు తీసుకునేందుకు రెడీ అయిందా? అంటే…