Movie News

రాజమౌళి – నీల్ – సుకుమార్….ఇప్పుడు పృథ్విరాజ్

నిర్మాత దిల్ రాజు సుడి కొత్త సంవత్సరంలో మహా భేష్షుగా ఉంది. గేమ్ ఛేంజర్ నిరాశపరిచినా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తో పాటు పలు హిట్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు బంగారు బాతులా మారి లాభాలు కురిపించాయి. ఇప్పుడు ఎల్2 ఎంపురాన్ ఆయనే ఏపీ, తెలంగాణలో పంపిణి చేస్తున్నారు. చివరి నిమిషంలో ఫోన్ చేసి అడిగినా అప్పటికపుడు స్పందించి ముందుకొచ్చారని దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పడం చూస్తే కంటెంట్ మీద రాజుగారికి చాలా నమ్మకం ఉన్నట్టుంది. ఇదిలా ఉంచితే పృథ్విరాజ్ మీద దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా లెజెండ్స్ లిస్టులో చేర్చేశారు.

గ్లోబల్ సినిమా స్థాయికి మనల్ని తీసుకెళ్లిన రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ సరసన పృథ్విరాజ్ ఈ సినిమాతో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు లూసిఫర్ 3 ఇంతకన్నా పెద్ద బడ్జెట్ తో మూడు వందల కోట్ల స్థాయిని అందుకోవాలని అన్నారు. మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ ఆయన్ని సూపర్ స్టార్ అనాలో ప్యాన్ ఇండియా స్టార్ అనాలో అర్థం కావడం లేదని కితాబిచ్చారు. క్యూ అండ్ ఏలో భాగంగా మార్చ్ 27, 28 తేదీల కాంపిటీషన్ గురించి వచ్చిన ప్రశ్నకు దిల్ రాజు సమాధానమిస్తూ అన్నీ పెద్ద బ్యానర్లే ఉన్నాయని, ఎవరి సినిమా ఎలా రిలీజ్ చేసుకోవాలో వాళ్లకు తెలుసంటూ చురక వేశారు.

ఈ సందర్భంగా తెలుగు పరిశ్రమ మీద మోహన్ లాల్, పృథ్విరాజ్ ఇద్దరూ తమ అభిమానాన్ని ప్రదర్శించారు. బాషా భేదం లేకుండా సినిమాలను ఆదరించే సంస్కృతి టాలీవుడ్ లాగే తమ దగ్గరా ఉందని, సలార్ కెజిఎఫ్ 2 పృథ్విరాజ్ స్వంతంగా డిస్ట్రిబ్యూట్ చేయడం, పుష్ప 2ని మొదటి రోజే మోహన్ లాల్ స్వయంగా థియేటర్ కు వెళ్లి చూసిన ఉదాహరణలు ప్రస్తావించారు. ప్రెస్ మీట్ సంగతి అలా ఉంచితే బుక్ మై షో అడ్వాన్స్ టికెట్ల అమ్మకాల్లో ఇప్పటికీ రికార్డు సృష్టించిన ఎల్2 ఎంపురాన్ పూర్తి స్థాయి బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. మార్చి 27 రిలీజ్ నాటికి టాప్ సౌత్ ఇండియన్ ఓపెనింగ్స్ లో చేరేలా ఉంది.

This post was last modified on March 22, 2025 3:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago