ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో హిందీ ‘గజిని’ ఒకటి. హాలీవుడ్ మూవీ ‘మొమెంటో’ స్ఫూర్తితో తమిళంలో సూర్య హీరోగా మురుగదాస్ ఈ పేరుతో రూపొందించిన చిత్రం తమిళంలోనే కాక తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత దీన్ని అదే పేరుతో ఆమిర్ హీరోగా హిందీలో రీమేక్ చేశాడు మురుగదాస్. 2008లోనే ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టి పాత ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని మురుగదాస్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు కానీ కుదరడం లేదు. ఐతే ఇప్పుడు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు స్వయంగా ఆయనే చెప్పాడు.
గత కొన్నేళ్లలో వరసగా డిజాస్టర్లు ఇచ్చిన మురుగ.. హిందీ మూవీ ‘సికందర్’తో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘సికందర్’ రంజాన్ కానుకగా ఈ నెల చివర్లో విడుదల కానుంది. ఈ సినిమా పని మొదలవడానికి ముందే ముంబయిలో ఆమిర్ ఖాన్‌ను కలిసినట్లు మురుగదాస్ వెల్లడించాడు. అప్పుడు గజిని-2 గురించి, వేరే కథల మీద తమ మధ్య చర్చలు జరిగాయన్నాడు.
ఐతే తర్వాత తాను ‘సికందర్’, ఆమిర్ ‘సితారే జమీన్ పర్’ చిత్రాలతో బిజీ అయ్యామని.. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక ఇద్దరం మళ్లీ కూర్చుంటామని.. గజిని-2 ఐడియాలపై డిస్కస్ చేస్తామని ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ వెల్లడించాడు. ఐతే గజిని-2 కార్యరూపం దాల్చాలంటే ముందు ‘సికందర్’ బాగా ఆడాలి. మురుగదాస్ ట్రాక్ రికార్డు ఇప్పటికే బాగా దెబ్బ తినేసింది. ‘సికందర్’ కూడా ఆడకపోతే.. అసలే ‘లాల్ సింగ్ చడ్డా’తో గట్టి ఎదురు దెబ్బ తిన్న ఆమిర్, మురుగదాస్‌తో సినిమా చేసే సాహసం చేయకపోవచ్చు.
This post was last modified on March 21, 2025 7:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…