అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళ శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే.. కొన్నేళ్లలోనే వీళ్లు విడాకులు తీసుకుంటారని వ్యాఖ్యానించిన ఘనత ఆయనకే సొంతం. ప్రభాస్ ఆరోగ్యం, తన కెరీర్ గురించి కూడా గతంలో వేణు స్వామి చెప్పిన జోస్యాలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై స్వయంగా ప్రభాస్ పెద్దమ్మ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా వేణు స్వామి చుట్టూ చాలా వివాదాలే ఉన్నాయి. చైతూ-శోభితల గురించి వేణు స్వామి మాట్లాడినపుడు తెలుగు సినీ పరిశ్రమ తరఫున కొందరు వెళ్లి మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయడం.. దీని మీద మీడియాలో కూడా రాద్దాంతం జరగడంతో వేణు స్వామి కొంచెం వెనక్కి తగ్గినట్లు కనిపించారు.
ఐతే కుక్క తోక వంకర అనే సామెతను గుర్తు చేస్తూ ఆయన తాజాగా ఒక జర్నలిస్టుతో మాట్లాడుతూ కొందరు సినీ తారల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వేణు స్వామి మీద ఇంతకుముందే టీవీ5లో చర్చ పెట్టి ఆయనకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసిన సీనియర్ జర్నలిస్ట్ మూర్తి.. తాజాగా మరోసారి వేణు స్వామి బాగోతాన్ని బయటపెట్టారు. ఒక జర్నలిస్టుతో మాట్లాడుతూ.. ముగ్గురు సినీ ప్రముఖులు రాబోయే రోజుల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోతారని వేణు స్వామి జోస్యం చెప్పారు. ఆ ముగ్గురూ.. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత కావడం గమనార్హం.
ప్రభాస్‌కు టాప్ టు బాటమ్ ఒళ్లంతా గాయాలే అంటూ.. ఆ బాధ తట్టుకోలేక సుసైడ్ చేసుకోవచ్చని వేణు స్వామి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పినవి గతంలో చాలా జరిగాయని.. ఇప్పుడు ఇవి కూడా జరిగి తీరుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి ఇలా మాట్లాడి, వారితో పరిహార పూజలు చేయించి భారీగా డబ్బులు తీసుకోవడం వేణు స్వామికి అలవాటని.. వేణు స్వామి బాధితులు చాలా మంది గురించి తనకు తెలుసని.. ఇండస్ట్రీ ఐకమత్యంగా ఉండి ఇలాంటి వారి పని పట్టాలని మూర్తి ఈ చర్చా కార్యక్రమంలో పిలుపునిచ్చారు.
This post was last modified on March 21, 2025 5:27 pm
కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాలు చేస్తున్నారా? లేక ఎండ వేడిమి తట్టుకోలేక.. ఇంటి పట్టునే ఉంటున్నారా? అంటే..…
ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సొంత పార్టీ బీజేపీ నేతలపై కా మెంట్లు…
వైసీపీ ఇప్పుడున్న పరిస్థితి నుంచి పైలేవాలంటే.. ఖచ్చితంగా పార్టీని పూర్తిగా జీరో నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. 2012లో…
తెలుగులో ఇప్పుడు సీక్వెల్స్, ఫ్రాంఛైజీ చిత్రాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి కానీ.. ఒకప్పుడు ఆ తరహా చిత్రాలు చాలా తక్కువగా…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపుగా నెల…
ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. కానీ తన తరం మిగతా హీరోయిన్ల లాగే…