గత నెల మళయాలంలో విడుదలైన ఆఫీసర్ ఆన్ డ్యూటీ సంచలన విజయం సాధించింది. కేవలం పది కోట్ల బడ్జెట్ తో తీస్తే అంతకు నాలుగింతలు యాభై కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. కుంచకో బోబన్ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ప్రియమణి భార్యగా నటించినా ఆమె స్పేస్ తక్కువే. జీతూ అష్రాఫ్ దర్శకత్వం వహించగా జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. టాక్ విన్న మన తెలుగు నిర్మాతలు డబ్బింగ్ చేయడంలో ఆలస్యం వల్ల మొన్న మార్చి 14 థియేటర్లలో రిలీజయ్యింది. కాకపోతే వారం తిరక్కుండానే నిన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో మల్టీలాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతోంది. అంతగా ఇందులో ఏముందబ్బా.
ఇదో మర్డర్ మిస్టరీ డ్రామా. విపరీతమైన కోపం, దూకుడు ఉన్న హరిశంకర్ (కుంచకో బోబన్) ఆ కారణంగా డిఎస్పి స్థాయి నుంచి ఎస్ఐ గా డిమోషన్ చేయించుకుంటాడు. ఒక నగల దొంగతనం కేసులో తీగను లాగుతూ పోతే దానికి టీనేజ్ వయసులో ఉరేసుకుని చనిపోయిన తన పెద్ద కూతురు ఆత్మహత్యకు లింక్ ఉందని తెలుస్తుంది. దీంతో విచారణను మరింత సీరియస్ గా తీసుకునే క్రమంలో ఈ ఘటనతో ముడిపడిన మరికొందరు చనిపోతారు. బెంగళూరులో ఉండే ఒక ఒక కుర్రాళ్ళ డ్రగ్స్ గ్యాంగ్ దీని వెనుక ఉందని పట్టుకోవడానికి బయలుదేరతాడు. దీనికి ముందు వెనుకా ఎన్నో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.
కథ పరంగా ఎప్పుడూ చూడనిది కాదు కానీ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో విసిగించకుండా చేయడంతో జీతూ అష్రాఫ్ విజయం సాధించాడు. విలన్ గ్యాంగ్ కుర్రాళ్లను చూస్తే కార్తీ గతంలో చేసిన నా పేరు శివ షేడ్స్ కనిపిస్తాయి కానీ దీనికిచ్చిన ట్రీట్ మెంట్, ముడిపెట్టిన ట్విస్టులు సెకండాఫ్ ని ఆసక్తికరంగా మార్చాయి. హత్యలు చేసిందెవరో టైటిల్ కార్డుకు ముందే రివీల్ చేసిన దర్శకుడు వాళ్ళను పట్టుకునే క్రమాన్ని ఇంటరెస్టింగ్ గా మలచడం వల్ల ఆఫీసర్ ఆన్ డ్యూటీ బోర్ కొట్టదు. కాకపోతే మరీ నెవర్ బిఫోర్ అనిపించే రేంజ్ అయితే కాదు. పెద్దగా అంచనాల్లేకుండా డీసెంట్ క్రైమ్ మూవీ చూడాలంటే మాత్రం ఆప్షన్ గా పెట్టుకోవచ్చు.
This post was last modified on March 21, 2025 12:43 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…