పునర్ణవి.. స్వతహాగా సినీ నటి అయినా.. ఆమెకు ఎక్కువ పాపులారిటీ వచ్చింది బిగ్ బాస్ షోతోనే. ఉయ్యాల జంపాల సినిమాలో ప్రత్యేక పాత్రతో తొలిసారి ప్రేక్షకుల కళ్లల్లో పడ్డ పునర్ణవి ఆ తర్వాత పిట్టగోడ అనే సినిమాలో కథానాయికగా కూడా నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో తళుక్కుమంది. ఐతే ఈ సినిమాలను మించి బిగ్ బాస్ షో ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆ షో తర్వాత కూడా అడపాదడపా తెరపై తళుక్కుమంటున్న పునర్ణవి.. ఇప్పుడు పెళ్లి వార్తతో తన ఫాలోవర్లను పలకరించింది. ఈ రోజు ట్విట్టర్లో తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. కానీ వరుడెవరన్నది మాత్రం వెల్లడించలేదు. అవతల ఆమె చేతిని అందుకున్న మరో చేయి కనిపిస్తోంది. అది వరుడిదేనా కాదా అన్నది తెలియడం లేదు. అది వరుడి చేయే అయితే.. అక్కడున్నది రాహుల్ సిప్లిగంజ్ మాత్రం కాదన్నది స్పష్టం. అది అతడి చేయిలాగా అయితే లేదు.
బిగ్ బాస్ షోలో రాహుల్-పునర్ణవిల సాన్నిహిత్యం ఎంతగా చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారన్న బలమైన అభిప్రాయాలు జనాలకు కలిగాయి. షో ముగిశాక కూడా వీళ్లిద్దరి సాన్నిహిత్యం కొనసాగింది. కలిసి కొన్ని షోల్లో కూడా పాల్గొన్నారు. ఐతే పునర్ణవితో తాను రిలేషన్‌షిప్‌లో లేనని, ఆమె జీవితంలో వేరే వ్యక్తి ఉన్నాడని రాహుల్ గతంలో క్లారిటీ ఇచ్చాడు.
పునర్ణవి కూడా ఇదే సంకేతాలు ఇచ్చింది. అయినా సరే వారి బంధం గురించి పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడేమో తన నిశ్చితార్థం గురించి పునర్ణవి అప్ డేట్ ఇచ్చింది. ఇంతకీ ఆమెకు కాబోయే వరుడెవరో.. దీనికి సంబంధించిన సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి మరి.
This post was last modified on October 29, 2020 10:50 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…