Movie News

గంటకు లక్ష టికెట్లు….ఎల్2కి ఇంత క్రేజుందా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ కు హైప్ ఉన్న మాట వాస్తవమే కానీ అది కేరళలోనే అధికంగా ఉంది. మిగిలిన భాషల్లో ఆశించిన బజ్ ఇంకా రాలేదు. ట్రైలర్ చూశాక అంచనాలు పెరిగాయి కానీ అవి ఎక్స్ట్రాడినరి ఓపెనింగ్స్ కి ఎంత వరకు దారి తీస్తాయో చెప్పలేం. అయితే బుక్ మై షోలో సగటున గంటకు 97 వేల టికెట్లు అమ్ముడుపోతున్నట్టు చూపిస్తున్న నెంబర్లు అభిమానులకు సైతం షాక్ ఇస్తున్నాయి. మాములుగా అయితే యునానిమస్ ప్రీ పాజిటివ్ బజ్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీస్ కి ఇలాంటి రికార్డులు మొదలవుతాయి. కానీ ఎల్2 ఎంపురాన్ కు మలయాళం మినహాయించి ఇతర భాషల్లో క్రేజ్ లేకపోయినా ఇంత స్పందన అనూహ్యం.

నిజంగానే ఆ రేంజ్ లో టికెట్లు అమ్ముడుపోతున్నాయా లేక ఏదైనా టెక్నికల్ గ్లిట్జ్ వల్ల అలా చూపిస్తుందో అంతు చిక్కడం లేదు. ఒకవేళ వాస్తవమే అయితే మోహన్ లాల్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయిందని చెప్పొచ్చు. సలార్ తో మనకు బాగా దగ్గరైన పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఎల్2 ఎంపురాన్ చాలా పెద్ద బడ్జెట్ తో తీశారు. మల్లువుడ్ లో మొదటి ఐమ్యాక్స్ మూవీ ఇది. బిజినెస్ పరంగానూ సులభంగా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేస్తుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉన్నాయి. మనవైపు ఏపీ తెలంగాణలో దిల్ రాజు పంపిణి చేయడం పెద్ద ప్లస్ కానుంది.

కాకపోతే ఎల్2 ఎంపురాన్ కు పోటీ గట్టిగానే ఉంది. తెలుగులో రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ కవ్విస్తుండగా తమిళంలో వీరధీరశూర పార్ట్ 2 నుంచి కాంపిటీషన్ టఫ్ గా ఉంది. అయితే మోహన్ లాల్ టీమ్ మాత్రం చాలా నమ్మకంగా ఉంది. గత కొంత కాలంగా ఈ సీనియర్ హీరోని వరస డిజాస్టర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్వీయ దర్శకత్వంలో తీసిన బరోజ్ నామరూపాల్లేకుండా పోయింది. అందుకే ఆ కసితో ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు. బుక్ మై షోలో దూకుడు చూస్తుంటే అన్నంత పని చేసేలానే ఉన్నాడు. మూడు గంటల అయిదు నిమిషాల నిడివితో ఎలాంటి కంటెంట్ ఇస్తారో చూద్దాం.

This post was last modified on March 21, 2025 11:13 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

1 hour ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

7 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

7 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

8 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

9 hours ago