ఆ మధ్య ఒక రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో బాలీవుడ్ సీనియర్ నిర్మాత బోనీ కపూర్ మీద టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా వసూళ్లు చూసి బాలీవుడ్ నిర్మాతలు నిద్ర పోలేదని వ్యాఖ్యానించడమే కాక.. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీయలేకపోతున్నారంటూ బోనీతో సంవాదానికి దిగాడు నాగవంశీ. దీనిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అలాగే అక్కడి మీడియా ప్రతినిధులు నాగవంశీ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై అప్పుడే నాగవంశీ స్పందించాడు.
తాను నిర్మాత కావడానికే కరణ్ జోహార్ లాంటి వాళ్లు స్ఫూర్తి అంటూ.. బోనీని తనేమీ కించపరచలేదన్నాడు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటుడు సంతోష్ శోభన్ ఈ అంశంపై నాగవంశీని ప్రశ్నించాడు. దీనికి అతను తనదైన శైలిలో బదులిచ్చాడు. బోనీ కపూర్ జాన్వి కపూర్ తండ్రి అని.. అలాంటి అమ్మాయిని కన్న వ్యక్తిని ఎవరైనా అగౌరవ పరుస్తారా అని నాగవంశీ ఎదురు ప్రశ్నించాడు. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఈ ఒక్క కోణంలో ఆలోచిస్తే తాను బోనీని కించపరచలేదని అర్థమవుతుందని నాగవంశీ ఫన్నీగా బదులిచ్చాడు.
ఇక ఈ మధ్య చాలామంది ప్రమోషన్ల కోసం సింపతీ కార్డ్ వాడుతున్నారు కదా, మరి మీ దగ్గర అలాంటి ఐడియా ఏమైనా ఉందా అని అడిగితే.. దానికీ నాగవంశీ ఫన్నీగా బదులిచ్చాడు. ఇటీవల విజయవాడలో జరిగిన రాబిన్ హుడ్ ప్రమోషనల్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. తమ సినిమా మాత్రమే ముందు చూడాలని అన్నాడని.. అంటే వేరే సినిమాలు చూడొద్దన్నది ఆయన ఉద్దేశమని.. ఇది తనకెంతో బాధ కలిగించిందని.. తమ సినిమాను తక్కువ చేశారని తెలుగు ప్రేక్షకులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని మ్యాడ్ స్క్వేర్ సినిమాను బాగా చూసి పెద్ద హిట్ చేయాలని నాగవంశీ అన్నాడు. నాగవంశీ సరదాగానే ఈ విషయం మాట్లాడడంతో తన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on March 21, 2025 10:31 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…