గతంలో హీరోగా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించిన కమెడియన్ సప్తగిరి.. చివరగా లీడ్ రోల్ చేసిన రెండు మూడు సినిమాలు తేడా కొట్టడంతో ఆ వేషాలను పక్కన పెట్టేశాడు. కమెడియన్‌గా కూడా అతడికి కొంచెం డిమాండ్ తగ్గింది. ఇలాంటి టైంలో అతను మళ్లీ హీరోగా చేసిన సినిమా.. పెళ్ళికాని ప్రసాద్. ఈ సినిమా ఎప్పుడు మొదలైందో, పూర్తయిందో తెలియదు. సడెన్‌గా రిలీజ్ డేట్‌తో టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ బాగానే అనిపించగా.. అంతకుమించి ఆకర్షించిన విషయం దిల్ రాజు నిర్మాణ సంస్థ ‘ఎస్వీసీ’ బేనర్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందుకు రావడం. దిల్ రాజు బేనర్ అంటే ఒక బ్రాండ్ అన్నట్లే. ఆ సంస్థ ఏవైనా వేరే ప్రొడక్షన్ హౌస్‌లు నిర్మించిన చిత్రాలను రిలీజ్ చేస్తోంది అంటే అందులో బలమైన కంటెంట్ ఉందని ప్రేక్షకులు నమ్ముతారు.
ఐతే ఈ సినిమాను రాజు బేనర్ టేకప్ చేయడానికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడే కారణమట. ఈ విషయాన్ని సప్తగిరే స్వయంగా వెల్లడించాడు. ‘‘మళ్లీ హీరోగా నటిస్తే మంచి కథతోనే చేయాలని చాలా రోజులు ఎదురు చూసి ‘పెళ్ళి కాని ప్రసాద్’ చిత్రాన్ని ఎంచుకున్నా. సినిమా మొదలవడానికి ముందే దర్శకుడు మారుతిని కలిసి కథ చెప్పా. ఆయన ఫస్ట్ కాపీతో రమ్మని చెప్పారు. ఆయన చెప్పినట్లే సినిమాను పూర్తి చేసి చూపించాం. సరిగ్గానే చేశారన్నారు. తర్వాత అనిల్ రావిపూడికి సినిమాను చూపించాను. ఆయనే నిర్మాత శిరీష్‌కు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు.
నేను నటుడిగా ప్రయాణం మొదలుపెట్టింది దిల్ రాజు సంస్థలోనే. ఐతే వాళ్లకు కంటెంట్ నచ్చితేనే సినిమాను రిలీజ్ చేస్తారు. శిరీష్ గారు సినిమా చూసి నచ్చాకే రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ‘పెళ్ళి కాని ప్రసాద్’ అనేది వెంకటేష్ గారు చేసిన గొప్ప పాత్ర. మా సినిమా ఆ పేరుకున్న బలాన్ని ఇంకా పెంచేలా ఉండాలనుకుని పని చేశాం. ఈ సినిమా ట్రైలర్ చూసి వెంకటేష్ గారు కూడా కంటెంట్ బాగుందన్నారు’’ అని సప్తగిరి చెప్పాడు. ఈ సినిమా చేస్తున్న టైంలో ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లకు పెళ్లయిందని.. తనకు కూడా త్వరలో పెళ్లవుతుందేమో చూడాలని సప్తగిరి అన్నాడు.
This post was last modified on March 20, 2025 3:29 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…