భారతీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద సినిమాల్లో ఒకటిగా పేరొందిన చిత్రం బండిట్ క్వీన్. 1994 శేఖర్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామా అప్పట్లో పెను సంచలనాలు సృష్టించింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బందిపోటు రాణిగా పేరొందిన పూలన్ దేవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని సీమా బిస్వాస్ టైటిల్ రోల్ పోషించగా సుప్రసిద్ధ నస్రత్ ఫతే అలీ ఖాన్ సంగీతం సమకూర్చారు. సెన్సార్ దశ నుంచే కాంట్రవర్సీకి కేంద్రంగా నిలిచిన బాండిట్ క్వీన్ ని నిషేదించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లో పూలన్ దేవి బహిరంగంగా హెచ్చరిక చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.
అగ్రవర్ణాల వాళ్ళు తక్కువ జాతికి చెందిన పూలన్ దేవి వివస్త్రను చేసి బావిలో నీళ్లు తోడించడం, సామూహిక మానభంగం చేయడం అన్నీ బోల్డ్ గా చిత్రీకరించడంతో అప్పట్లో బాండిట్ క్వీన్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరికి అన్ని అడ్డంకులు దాటుకుని జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్ రిలీజ్ చేస్తే ఘనవిజయం సాధించింది. దేశీ విదేశీ వసూళ్లు కలిపి ఒకటికి పదింతలు లాభం తెచ్చిన సినిమాగా దీని గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. అయితే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న బాండిట్ క్వీన్ ని చూసి శేఖర్ కపూర్ నివ్వెరపోయారు. కారణం చాలా భాగం ఎడిటింగ్ చేయడమే.
50 డిగ్రీల మండుటెండల్లో ఎంతో కష్టపడి బాండిట్ క్వీన్ తీశామని, ఎక్కడో రూమ్ లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు ఎడిటింగ్ చేసిన వాళ్లకు ఆ శ్రమ తెలియదని సుదీర్ఘంగా ట్వీట్ చేశారు. టీమ్ గౌరవానికి భంగం కలిగించేలా కత్తిరింపులు చేయడం పట్ల కలత చెందినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా జాతీయ అవార్డు దక్కించుకున్న బాండిట్ క్వీన్ లాంటి క్లాసిక్ మూవీకి ఇలా ఎడిటింగ్ పేరుతో కోతలు వేయడం నిజంగా అవమానమే. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో కేవలం ఏడు సినిమాలు మాత్రమే తీసిన శేఖర్ కపూర్ బెస్ట్ వర్క్ ఏదంటే మూవీ లవర్స్ వెంటనే చెప్పే పేరు మిస్టర్ ఇండియా. ఆ తర్వాత స్థానం బాండిట్ క్వీన్ దే.
This post was last modified on March 20, 2025 6:37 am
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల షూటింగ్ ఏ దశలో ఉన్నా విడుదల తేదీలు కనీసం ఏడాది ముందు రిజర్వ్ చేసుకోవాల్సిన…
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మొదటిసారి థియేట్రికల్ రిలీజయ్యింది 2023 డిసెంబర్లో. అంటే కేవలం పదిహేను నెలలు మాత్రమే…
దివంగత ఎన్టీఆర్ నటన గురించి ఎంత చెప్పినా.. వేనేళ్ల పొగిడినా తక్కువే. ఆయన నటనకు మరింత అద్దం పట్టిన పాత్ర…
మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ కు హైప్ ఉన్న మాట వాస్తవమే కానీ అది కేరళలోనే అధికంగా ఉంది. మిగిలిన…
వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో నలుగురి పరిస్థితి ఎలా ఉన్నా.. మిగిలిన ఏడుగురు మాత్రం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు.…
ఆ మధ్య ఒక రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో బాలీవుడ్ సీనియర్ నిర్మాత బోనీ కపూర్ మీద టాలీవుడ్ ప్రొడ్యూసర్…