మామూలుగా ఒక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఆలస్యంగా రిలీజైతే కొంచెం బజ్ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘రాబిన్ హుడ్’ విషయంలో అలా ఏమీ జరగట్లేదు. గత ఏడాది క్రిస్మస్‌కు అనుకున్న ఈ చిత్రం.. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రిస్మస్ వీకెండ్ మిస్ అయింది. సంక్రాంతి సీజన్ పోయింది. ఎట్టకేలకు సినిమా రిలీజవుతోంది.
ఐతే కొన్ని నెలల పాటు అసలు చర్చల్లో లేకుండా పోయిన ఈ సినిమాను రిలీజ్ ముంగిట టీం భలేగా ప్రమోట్ చేసింది. ఇంట్రెస్టింగ్ ప్రోమోలకు తోడు సరదా ప్రమోషన్లతో ‘రాబిన్ హుడ్’కు మంచి హైప్ తీసుకురాగలిగింది. సినిమా మీద టీం అందరూ చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. ఛలో, భీష్మ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల.. తన కెరీర్లో ‘రాబిన్ హుడ్’యే బెస్ట్ వర్క్ అని అంటున్నాడు.
రిలీజ్ ముంగిట సినిమా గురించి అందరూ ఇలా కాన్ఫిడెంట్‌గానే మాట్లాడతారు. కానీ వెంకీ కుడుముల అంతటితో ఆగట్లేదు. సినిమా మీద తనకెంత నమ్మకమో చాటుతూ.. ‘రాబిన్ హుడ్’ ఉత్తరాంధ్ర రైట్స్‌ను తనే కొనుక్కున్నాడట. మరి పారితోషకం కింద రైట్స్ తీసుకున్నాడా లేక అందుకోసం వేరుగా డబ్బులు పెట్టాడా అన్నది తెలియదు కానీ.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుందన్న ధీమాతోనే అతను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
‘పుష్ప-2’ తర్వాత మైత్రీ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనికి రిలీజ్ కూడా కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వారం రోజుల్లో ప్రమోషన్లను మరింత పీక్స్‌కు తీసుకెళ్లబోతున్నారు. ట్రైలర్ కూడా బాగుంటే ‘రాబిన్ హుడ్’కు హైప్ ఇంకా పెరగడం ఖాయం. కాకపోతే మార్చి చివరి వారంలో వేరే సినిమాల పోటీ గట్టిగానే ఉంది. దాన్ని తట్టుకుని ‘రాబిన్ హుడ్’ అదరగొడుతుందేమో చూడాలి.
This post was last modified on March 19, 2025 10:37 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…