క్రికెట్ పండగ వస్తోంది. మార్చి 22 నుంచి మే 25 దాకా రెండు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు దేశ విదేశాల నుంచి క్రికెటర్లు ఇండియాకు వచ్చేస్తున్నారు. ఈసారి ప్రతి టీమ్ వెరైటీగా సినిమా ట్రైలర్ల తరహాలో ప్లేయర్ల వీడియోలు చేయించి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏకధాటిగా అరవై రోజులకు పైగా రోజుకో మ్యాచ్ ఉండబోతున్న నేపథ్యంలో వీటి ప్రభావం బాక్సాఫీస్ మీద ఎలా ఉంటుందోననే ఆందోళన ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇది ప్రతి ఏడాది జరిగే టోర్నమెంటే అయినా సంవత్సరాలు గడిచే కొద్దీ క్రేజ్ ఊహించని స్థాయిలో అంతకంతా పెరుగుతూ పోవడమే దీనికి కారణం.
ఒకపక్క మండిపోతున్న ఎండలు. ఇంకోవైపు క్రికెట్. మధ్యలో చాలా బాగుందనే టాక్ వస్తే తప్ప థియేటర్ ముఖాలు చూడని జనం. ఈ నేపథ్యంలో వేసవి కాలం నిర్మాతలకు పెద్ద పరీక్షే పెట్టనుంది. కాంపిటీషన్ ఎంత ఉన్నా ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా ఆడే మ్యాచులకు ఎక్కువ డిమాండ్, వ్యూయర్ షిప్ ఉంటుంది. తర్వాతి వరసలో లక్నో, ఢిల్లీ, రాజస్థాన్ తదితరాలు ఉన్నాయి. అన్ని సాయంత్రం ఏడున్నరకు మొదలయ్యే నైట్ మ్యాచులు కావడంతో ఈవెనింగ్, సెకండ్ షోల మీద వీటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినవాటికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ యావరేజ్, ఫ్లాపులకు చిక్కొస్తుంది.
ఏప్రిల్ రెండో వారం నుంచి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. జాక్ తో మొదలుపెట్టి అటుపై హరిహర వీరమల్లు దాకా వారానికి ఒకటి రెండు భారీ బడ్జెట్లతో బరిలో దిగుతున్నాయి. ఎక్స్ ట్రాడినరి అనిపించుకుంటే ఐపీఎల్ తో వచ్చే నష్టమేమి లేదు. టాక్స్ బాగుంటే ఉదయం, మధ్యాన్నం ఆటలు సమ్మర్ లోనే బాగా నిండుతాయి. ఏసి చల్లదనంతో పాటు బాగున్న బొమ్మ చూస్తామనే ఆలోచన ఎక్కువ పబ్లిక్కుని థియేటర్ల వైపు లాగుతుంది. మార్చి చివరిలో వారం డబ్బింగ్ స్ట్రెయిట్ కలిపి మొత్తం నాలుగు చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ముందు క్రికెట్ వల్ల ప్రభావితం చెందేవి ఇవే.
This post was last modified on March 19, 2025 7:10 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…