బాహుబలి తర్వాత సీక్వెల్ ట్రెండ్ అనేది ఎంత పాపులరయ్యిందో చూస్తున్నాం. కెజిఎఫ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లు దానికి మరింత ఊత మిచ్చాయి. దాదాపు స్టార్ హీరోలందరూ కొనసాగింపుల మీద తెగమక్కువ చూపిస్తున్నారు. అయితే మొదటి భాగం రిలీజయ్యాక సెకండ్ పార్ట్ రావడమనేది హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్నిచోట్లా ఉన్నదే. కానీ విక్రమ్ వీర ధీర శూర మాత్రం దీనికి రివర్స్ లో వెళ్తోంది. వచ్చే వారం మార్చి 27 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ డ్రామా ముందు రెండో భాగం రిలీజ్ చేసి ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ షూటింగ్ మొదలుపెడతారట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.
ఓ రేంజ్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఇంత రిస్క్ ఎవరూ చేయరు. ఒకవేళ వీరధీర శూర పార్ట్ 2 ఏ మాత్రం తేడా కొట్టినా కంటిన్యూయేషన్ కి హైప్ రాదు. ఇది తెలిసే దర్శకుడు అరుణ్ కుమార్ సాహసానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఇతని ట్రాక్ రికార్డు అలాంటిది. మొదటి సినిమా పరియేరుమ్ పెరుమాళ్ తో ఇండస్ట్రీ దృష్టితో పాటు అవార్డులను ఆకర్షించాడు. ,కమర్షియల్ గానూ విజయం సాధించాడు. ఆ తర్వాత సేతుపతి, సింధుబాద్ భారీగా ఆడకపోయినా వసూళ్ల పరంగా సేఫ్ అయ్యాయి. సిద్దార్థ్ తో తీసిన చిన్నా తమిళంలో బాగా ఆడింది. సో ఇదంతా చూసే విక్రమ్ ముందు పార్ట్ 2 అన్నా వెంటనే ఒప్పేసుకున్నాడు.
తెలుగులో వీరధీరశూర పార్ట్ 2కి బజ్ లేదు. విక్రమ్, ఎస్జె సూర్య, సూరజ్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఇది ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. ప్రమోషన్లకు తగినంత టైం లేకపోవడంతో టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోంది. త్వరలో హైదరాబాద్ లో పబ్లిసిటీ మొదలుపెట్టబోతున్నారు. ఒక కిరాణా కొట్టు ఓనర్ కు ఒకే రాత్రి ఎదురైన ప్రమాదాల వల్ల పోలీస్ అధికారి, స్థానిక గూండాతో తగవు పెట్టుకోవాల్సి వస్తుంది. దాన్నుంచి అతను ఎలా బయట పడ్డాడనేది స్టోరీ. దాదాపు సినిమా మొత్తం చీకటిలోనే ఉంటుంది. ఇది క్లిక్ అయితే పార్ట్ 1 తీస్తారేమో. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఆకర్షణ కాగలదని టాక్.
This post was last modified on March 19, 2025 6:56 pm
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్డేట్…
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…