గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై మిలియన్ల వ్యూస్ సులభంగా వచ్చేలా చేయగలనని, కానీ సరైన హుక్ స్టెప్ లేకుండా రీచ్ రాకపోతే సంగీత దర్శకుడు ఎలా బాధ్యుడవుతాడని తాజాగా తమన్ చేసినా కామెంట్స్ మ్యూజిక్ లవర్స్ మధ్య హాట్ టాపిక్ గా మారాయి. ఇది నిజంగా రైటా అంటే రెండు వైపులా ఆలోచించాలి. అదెలాగో చూద్దాం. డాన్స్ మాస్టర్ చేయించే స్టెప్పులతో సాంగ్స్ స్థాయి పెరగడమనేది వాస్తవమే. హిట్లర్ లో అబీబీ అబీబీ, ఇంద్రలో దాయి దాయి దామ్మాలు చిరంజీవి హుక్ స్టెప్స్ తోనే రిపీట్ ఆడియన్స్ ని తీసుకొచ్చాయి.
యమదొంగ, మగధీర, ధమాకా, గుంటూరు కారం, మారి 2, ఫిదా, అఖండ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు సాంగ్స్, స్టెప్పులు పర్ఫెక్ట్ సింక్ లో కుదరటం వల్ల ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక రెండో వైపుకు వెళ్తే అసలు నృత్యాలే లేని పాటలు వందల మిలియన్ల వ్యూస్ సాధించడం కూడా ఉన్నాయి. గీత గోవిందంలో ఇంకేం కావాలే, బేబీలో ఓ రెండు మేఘాలిలా, హుషారులో ఉండిపోరాదే కేవలం మెలోడీ ట్యూన్స్ తోనే ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నవి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీదకు వెంకీ, ఐశ్యర్య రాజేష్ మధ్య సింపుల్ గా అనిపించే స్టెప్పులే పాటకు బోలెడు అందాన్ని తీసుకొచ్చాయి.
సో ఇది నాణేనికి బొమ్మా బొరుసులా రెండు వెర్షన్లున్న టాపిక్. ఒక సైడే మాట్లాడలేం. తమన్ అన్నట్టు గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ కష్టపడ్డాడు కానీ గుర్తుండిపోయేలా ఎలాంటి హుక్ స్టెప్స్ లేకపోవడం నిజమే. అలాని సాంగ్స్ ఎవర్ గ్రీనా అంటే అదీ కాదు. కొండ దేవర, హైరానా మాత్రమే సంగీత ప్రియులతో ఎస్ అనిపించుకున్నాయి. మిగిలినవి యావరేజేగా. కాబట్టి ఇది డిబేట్ గా చెప్పుకుంటూ పోతే ఎడతెగని చర్చకు దారి తీస్తుంది కానీ మ్యూజిక్, కొరియోగ్రఫీ మధ్య సరైన అనుసంధానం ఉంటే ఎప్పటికి నిలిచిపోయే సాంగ్స్ వస్తాయి. తరాలు మారినా గుర్తుండిపోయేలా చిరకాలం వినిపిస్తూనే ఉంటాయి.
This post was last modified on March 18, 2025 3:09 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…