గత కొన్నేళ్లుగా మలయాళంలో క్వాలిటీ కంటెంట్ వస్తోందనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టడం మీద కాకుండా క్రియేటివిటికి పదును పెట్టడం ద్వారా అక్కడి దర్శకులు అద్భుత ఫలితాలు అందుకుంటున్నారు. రేఖా చిత్రం, సూక్ష్మ దర్శిని, కిష్కింద కాండం, పని, ఆఫీసర్ ఆన్ డ్యూటీ వగైరాలు అలా వచ్చి హిట్టు కొట్టినవే. తాజాగా పొన్ మ్యాన్ ఆ కోవలోకే చేరుతోంది. బాసిల్ జోసెఫ్ హీరోగా రూపొందిన ఈ వెరైటీ ఫ్యామిలీ డ్రామా థియేట్రికల్ గా మంచి సక్సెస్ అందుకుంది. తెలుగు డబ్బింగ్ తో పాటు ఇటీవలే ఓటిటిలో వచ్చింది. చూసిన జనాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అసలీ కథలోని వెరైటీ ఐడియాని మెచ్చుకోవలసిందే. అజేష్ (బాసిల్ జోసెఫ్) గోల్డ్ ఏజెంట్. అంటే పెళ్లిళ్లకు కావాల్సిన నగలు సమకూరుస్తాడు. చదివింపుల ద్వారా వచ్చిన డబ్బుని జమేసుకుని వ్యాపారం చేయడం ఇతని డ్యూటీ. ఒకవేళ వచ్చిన సొమ్ము సరిపోకపోతే మిగిలిన బంగారం వెనక్కు ఇచ్చేయాలి. అలా స్టెఫీ (లీజోమల్ జోసే) పెళ్ళికి 25 సవర్ల ఆభరణాలు ఇస్తాడు. కానీ కానుకల్లో 12 సవర్ల డబ్బులే వస్తాయి. బ్యాలన్స్ మొత్తానికి సరిపడా గోల్డ్ వెనక్కు ఇవ్వకుండా స్టెఫీ మొగుడితో కలిసి అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి అజేష్ కు అసలు సవాల్ మొదలవుతుంది. అనూహ్య మలుపులు చోటు చేసుకుంటాయి.
దర్శకుడు జ్యోతిష్ శంకర్ తీసుకున్న పాయింట్ చాలా చిన్నదే అయినప్పటికీ దాన్ని ఆసక్తికరంగా, విసుగు రాకుండా చేయడంలో రాసుకున్న కథనం ఆకట్టుకునేలా సాగింది. సహజంగా మల్లువుడ్ మూవీస్ లో ఉండే నెమ్మదితనం పొన్ మ్యాన్ లోనూ ఉంది. అయితే కాలక్షేపానికి లోటు లేకుండా వినోదంతో పాటు కాసింత థ్రిల్ ని పంచుతూ టైం పాస్ చేయించే స్క్రీన్ ప్లే బోర్ కొట్టకుండా చేసింది. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ అండగా నిలవడంతో మాములు సీన్లు సైతం ఎంగేజ్ చేస్తాయి. మరీ అదరహో బెదరహో అనలేం కానీ క్రేజీ ఐడియాతో వచ్చిన పొన్ మ్యాన్ మూవీ లవర్స్ ని నిరాశపరిచే అవకాశం తక్కువ.
This post was last modified on March 18, 2025 12:22 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…