మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్ డైరెక్టర్ కు సంబంధం లేని మ్యాటర్. ఒక్కోసారి ఈ ఆలస్యం ఆడియో ఆల్బమ్ మీద ప్రభావం చూపించిన సందర్భాలు లేకపోలేదు. తమన్ మాత్రం ది రాజా సాబ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ ప్యాన్ ఇండియా మూవీ ప్రారంభంలో కంపోజ్ చేసుకున్న ట్యూన్స్ కాల ప్రభావం వల్ల ఫ్రెష్ నెస్ కోల్పోయాయని, అందుకే వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి మళ్ళీ తాజాగా కొత్త పాటలు చేసే పనిలో ఉన్నట్టు చెప్పాడు. దానికి కారణాలు కూడా వివరించాడు.
ముప్పై నలభై కోట్లు పెట్టి ఆడియో కంపెనీలు హక్కులు కొంటున్నప్పుడు బెస్ట్ ఇచ్చే బాధ్యత సంగీత దర్శకుల మీద ఉంటుందని, అందుకే రాజా సాబ్ కోసం అదనంగా కష్టపడేందుకు సిద్ధమయ్యామని చెప్పుకొచ్చాడు. నిజమేగా. గేమ్ ఛేంజర్ కు ఈ సమస్య రావడం వల్లే ఒకటి రెండు సాంగ్స్ మినహాయించి మిగిలినవి పెద్ద రీచ్ కాలేదు. రాజా సాబ్ కు అలా జరగకూడదనే తమన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇంకా నాలుగు పాటల షూట్ బ్యాలన్స్ ఉంది. ప్రభాస్ డేట్ల కోసం మారుతీ ఎదురు చూస్తున్నాడు. ఫౌజీ నుంచి ఫ్రీ కాగానే వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పీపుల్స్ మీడియా టీమ్ ఎదురు చూస్తోంది.
ఇప్పుడు తమన్ చెప్పిన ప్రకారం పాటలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. విడుదల తేదీ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దసరా లేదా దీపావళికి వస్తుందనే ఆశతో ఉన్న అభిమానుల కోరిక ఏ మేరేకు నెరవేరుతుందో చెప్పలేం. ఒకవేళ సాధ్యం కాకపోతే సలార్ లాగా డిసెంబర్ లో అయినా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. 2026 సంక్రాంతికి ఆల్రెడీ పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాజా సాబ్ ముందుగా సోలో డేట్ చూసుకుని రావడం బెటర్. హారర్ జానర్ లో రూపొందిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు కాగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
This post was last modified on March 18, 2025 10:52 am
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…