విడుదలై నెలరోజులు దాటుతున్నా ఛావా పరుగులు ఆగడం లేదు. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతం వస్తే చాలు విక్కీ కౌశల్ మళ్ళీ పేట్రేగిపోతున్నాడు. దీని తర్వాత చెప్పుకోదగ్గ బాలీవుడ్ మూవీ రాకపోవడం వసూళ్ల పరంగా కలిసి వస్తోంది. ఇటీవలే రిలీజైన జాన్ అబ్రహం ది డిప్లమాట్ కు మంచి టాక్ వచ్చినా కూడా అది కలెక్షన్లుగా మారలేకపోతోంది. ఆలస్యంగా రిలీజైనప్పటికీ ఛావా తెలుగు వెర్షన్ పదిహేను కోట్లను దాటేయడం చిన్న విషయం కాదు. ఒకవేళ కోర్ట్ కనక దూకుడుగా లేకపోయి ఉంటే మరాఠా వీరుడు పాతిక కోట్లను టార్గెట్ చేసేవాడే. కానీ మిస్సయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
తాజాగా ఛావా మరో మెయిలు రాయి అందుకుంది. నెట్ కలెక్షన్ల పరంగా ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. యానిమల్ (553 కోట్లు), జవాన్ (543 కోట్లు) ని దాటేసి ఛావా 555 కోట్లను అందుకుంది. ఇంకా ఫైనల్ రన్ కాలేదు కాబట్టి మరో వంద కోట్లకు పైగా అదనంగా తొడవ్వొచ్చని ఒక అంచనా. గ్రాస్ పరంగా చూసుకుంటే ఛావా 741 కోట్లతో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓవర్సీస్ లోనూ 86 కోట్ల దాకా వసూలు చేయడం మరో రికార్డు. టాప్ 10లోకి ప్రవేశించిన ఛావా హీరో విక్కీ కౌశల్ కు తొలిసారి ఈ క్లబ్బులో చోటు సంపాదించి పెట్టింది. ఖాన్లు, కపూర్ల డామినేషన్ ని సవాల్ చేసే నెంబర్లు ఇచ్చింది.
ఇక ఛావా ముందున్న నెక్స్ట్ టార్గెట్ వెయ్యి కోట్ల గ్రాస్. అదేమీ అసాధ్యం కాదు కానీ అలాని సులభము కాదు. ఇప్పటికే నెమ్మదించిన రన్ ని తిరిగి కొనసాగించాలంటే జనాన్ని మళ్ళీ థియేటర్లకు వచ్చేలా చేయాలి. ఒక వారం రోజులు అయ్యాక ఓటిటి స్ట్రీమింగ్ దగ్గర్లో ఉన్నప్పుడు ఆఫర్లు ప్రకటించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. వన్ ప్లస్ వన్, వంద రూపాయలకు మల్టీప్లెక్స్ టికెట్ లాంటివి జనాన్ని బాగా ఆకర్షిస్తాయి. మరి ఛావా ప్రొడ్యూసర్లు అలాంటివి ఏమైనా చేస్తే పుంజుకునే అవకాశం కొట్టిపారేయలేం. ఛావా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ దాన్ని ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేయొచ్చట.
This post was last modified on March 17, 2025 10:31 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్…
పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత భారతదేశ పురస్కారాలు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి సిగలో మరో కలికితురాయి తోడయ్యింది. యుకె పార్లమెంట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార సరళి ఇతరులకు భిన్నంగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకున్నారంటే... పవన్…
ఏపీలో వైసీపీ గత పాలనకకు, కూటమి ప్రస్తుత పాలనకు స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోంది. అది కూడా ఈ 9…
మార్కో వచ్చే దాకా హనీఫ్ అదేని అనే కేరళ దర్శకుడు బయట వాళ్లకు పెద్దగా తెలియదు. 2017లో ది గ్రేట్…
ఏడేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్ సినిమాది విచిత్రమైన కథ. ముందు మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత తెలుగులో డబ్బింగ్…