Movie News

క్రిష్ 4 బడ్జెట్ చూసి భయపడుతున్నారు

తెరమీద ఇండియన్ సూపర్ హీరోస్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు క్రిష్. హృతిక్ రోషన్ హీరోగా ఆయన తండ్రి రాకేష్ రోషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ ప్యాన్ ఇండియా మూవీ 2006 లోనే రికార్డులు బద్దలు గొప్ప విజయం సాధించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ భారీ వసూళ్లు రాబట్టి చిన్నా పెద్ద అందరిని అలరించింది. దీని స్ఫూర్తితోనే షారుఖ్ ఖాన్ రా వన్ తీసి బోల్తా పడటం వేరే విషయం. తిరిగి 2013లో క్రిష్ 3 వచ్చింది. కోయి మిల్ గయాని ఈ సిరీస్ లో కలిపేయడంతో రెండో భాగం స్థానంలో త్రీ పెట్టారు. ఇది కూడా పెద్ద హిట్టే. ఇదంతా జరిగిపోయి పన్నెండేళ్ళు గడిచిపోయాయి.

క్రిష్ 4 కోసం రాకేష్ రోషన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ కార్యరూపం దాల్చడం లేదు. ముంబై కథనాల ప్రకారం క్రిష్ 4 కోసం వేసుకున్న బడ్జెట్ 700 కోట్లట. అంత మొత్తం కుమ్మరించడానికి ఏ ప్రొడక్షన్ హౌస్ సిద్ధంగా లేకపోవడంతో ప్రారంభించలేకపోతున్నట్టు సమాచారం. దీని కోసం సిద్దార్థ్ ఆనంద్ ని రంగంలోకి దించిన హృతిక్ రోషన్ అతని మార్ ఫ్లిక్స్ సంస్థ ద్వారా బడ్జెట్ పెట్టించేందుకు ప్రయత్నించాడు. ఫైటర్ నుంచి వీళ్ళ స్నేహం బలపడింది. దర్శకత్వ బాధ్యతలు హృతిక్ తండ్రికి కాకుండా కరణ్ మల్హోత్రాకు ఇచ్చేందుకు ఎస్ అనుకున్నారు. తీరా చూస్తే సిద్దార్థ్ ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చాడని టాక్.

సో వార్ 2 విడుదలయ్యే దాకా వేచి చూడాలని రోషన్ ఫ్యామిలీ నిర్ణయించుకోవడంతో క్రిష్ 4కి పెద్ద బ్రేక్ పడింది. గత పదేళ్లలో ఎన్నో హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ మన దేశంలోనూ భారీ వసూళ్లు సాధించాయి. చిన్నా పెద్ద ప్రేక్షకులు లార్జర్ తాన్ లైఫ్ కథలకు అలవాటు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో ఇరవై సంవత్సరాల నాటి ఆలోచనలతో క్రిష్ 4 తీస్తే వర్కౌట్ కాదు. అయితే వార్ 2 కనక బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు హృతిక్ మార్కెట్ కి మరింత డిమాండ్ వస్తుందని, అప్పుడు ఏడు వందల కోట్లు పెద్ద మ్యాటర్ కాదని హృతిక్ భావిస్తున్నట్టు తెలిసింది. అయినా ఒకప్పటిలా క్రిష్ కు అంత ఫాలోయింగ్ ఉందా అంటే డౌటే.

This post was last modified on March 15, 2025 3:54 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Krish 4

Recent Posts

సప్తగిరి పక్కన హీరోయిన్ గా ఒప్పుకోలేదా…

ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…

35 minutes ago

18న ఢిల్లీకి బాబు… అజెండా ఏంటంటే?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…

56 minutes ago

మహిళలకు కూటమి అదిరే గిఫ్ట్!… అగ్రి ప్రోడక్ట్స్ కూ బూస్టే!

ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…

2 hours ago

షాకింగ్‌: ద‌స్త‌గిరి భార్య‌పై దాడి.. చంపుతామ‌ని బెదిరింపు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌లో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవ‌ర్‌గా మారిన షేక్ ద‌స్త‌గిరి భార్య షాబానాపై…

3 hours ago

విజయ్ దేవరకొండ అన్నయ్యగా సత్యదేవ్ ?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…

3 hours ago

ఎంపీ డీకే ఇంట్లోకి ఆగంతకుడు… కానీ చోరీ జరగలేదు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…

4 hours ago