Movie News

కోర్ట్ ఓపెనింగ్….అదిరింది యువరానర్

నిర్మాతగా నాని జడ్జ్ మెంట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో కోర్ట్ రూపంలో మరోసారి ఋజువైపోయింది. ప్రీమియర్లతో కలిపి తొలి రోజు 8 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందనే రిపోర్ట్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సినిమా బాగుంటుందని ఆశించినా వసూళ్లు ఇంత వేగంగా పికప్ అవుతాయని భావించలేదని, కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదని బయ్యర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న హోలీ సెలవు రోజుని పూర్తిగా వాడుకుంది కోర్ట్ ఒకటే. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో లక్షా ఇరవై వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం దానికి నిదర్శనం.

ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కోర్ట్ మరింత బలంగా నిలవనుంది. స్క్రీన్లు పెంచుతున్నారు. ముందు తక్కువంచనా చేసి పరిమిత షోలు వేసిన బిసి సెంటర్లలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా ఒక సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామాకు ఇంత స్థాయి స్పందన నిజంగా రికార్డే. పోటీలో ఉన్న దిల్ రుబాకు ప్రతికూల ఫలితం రావడంతో అధిక శాతం ప్రేక్షకులకు నాని మూవీనే ఛాయస్ అవుతోంది. నన్ను నమ్మండి అంటూ న్యాచురల్ స్టార్ ఇచ్చిన హామీకి న్యాయం జరిగింది. దగ్గర్లో కొత్త రిలీజులు పెద్దగా లేవు కాబట్టి కోర్ట్ ఫైనల్ నెంబర్స్ ఇప్పుడే ఊహించి చెప్పడం కష్టం. భారీగా ఉండబోతున్నాయి.

ప్రియదర్శి, శివాజీతో పాటు హీరో హీరోయిన్లు హర్ష్, శ్రీదేవిలకు కోర్ట్ మంచి బ్రేక్ అవుతోంది. థియేటర్లలో సీన్లకు చప్పట్లు విజిల్స్ పడుతున్నాయి. కొన్ని లోపాలు,హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ జనం కోరుకున్న ఎంటర్ టైన్మెంట్ ని సీరియస్ గా ఇచ్చిన కోర్ట్ ఫైనల్ గా సూపర్ హిట్ ముద్ర దాటేసి బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతోంది. దర్శకుడు రామ్ జగదీశ్ కు అప్పుడే ఆఫర్లు మొదలయ్యాయని ఇన్ సైడ్ టాక్. ఇంకో వారం రోజులు దీని ప్రమోషన్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్న నాని తర్వాత హిట్ 3 ది థర్డ్ కేస్ పబ్లిసిటీని ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తానికి ప్రొడ్యూసర్ గా మరో విజయం ఖాతాలో వేసుకున్నాడు.

This post was last modified on March 15, 2025 11:26 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago