అమితాబ్ బచ్చన్ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలీవుడ్లోకి రంగప్రవేశం చేసిన నటుడు.. అభిషేక్ బచ్చన్. కానీ అతను తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోయాడు. దాదాపు పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ స్టార్‌గా ఎదగలేకపోయాడు అభిషేక్. కానీ అప్పుడప్పుడూ తన నుంచి మంచి సినిమాలే వస్తున్నాయి. కానీ తండ్రిలా పెద్ద స్టార్ కాలేకపోయాడని అతడి మీద తరచుగా కౌంటర్లు పడుతూనే ఉంటాయి. తన బాక్సాఫీస్ ఫెయిల్యూర్ల మీద సెటైర్లూ మామూలే. ఫెయిల్యూర్లు, విమర్శలను తట్టుకోలేక అభిషేక్ బాగానే హర్టయ్యాడట. సినిమాలు మానేద్దామని, బాలీవుడ్ వదిలేద్దామని కూడా అనుకున్నాడట.
కానీ తన తండ్రే తనను ఆపినట్లు అభిషేక్ వెల్లడించాడు. ‘‘ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక కెరీర్ పరంగా ఎత్తు పల్లాలు ఎన్నో చూశా. నటుడిగా విభిన్న చిత్రాలతో అలరించాలన్నది నా ఆకాంక్ష. ఆ మేరకు ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ నటుడిగా ఆశించిన గుర్తింపు సంపాదించలేకపోయా. అందువల్ల చాలాసార్లు బాధ పడ్డా. సినిమాలు వదిలేసి ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోవాలనిపించింది. నటన మానేయాలని అనుకున్నాక నాన్నకు విషయం చెప్పాను. నా అభిప్రాయం విన్నాక ఆయన ఒకటే చెప్పారు.
‘ఇప్పుడే ప్రయాణం మొదలైంది. నువ్వు ఎంతో దూరం వెళ్లాలి. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. అన్నింటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి సినిమా నుంచి ఒక విషయం నేర్చుకుంటూ సాగితే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు. కాబట్టి పోరాడుతూ ఉండు’ అని ఆయన అన్నారు. నాన్న మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. నటనలో కొనసాగాలని ఫిక్సయ్యా’’ అని జూనియర్ బచ్చన్ చెప్పాడు. ఈ ప్రయాణంలో ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ ఎవ్వరూ సాధించలేరని అర్థం చేసుకున్నాకే తాను ఇండస్ట్రీలో కొనసాగగలుగుతున్నానని అభిషేక్ చెప్పాడు. అభిషేక్ నటించిన ‘బి హ్యాపీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
This post was last modified on March 14, 2025 7:33 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…