ఖుషి తర్వాత స్క్రీన్ పై కనిపించకుండా పోయిన సమంతా తిరిగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన స్వంత ప్రొడక్షన్ లో రూపొందుతున్న మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ గట్రా బయటికి చెప్పకుండా సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ స్పందన అంతంత మాత్రంగానే రావడంతో బలమైన కంబ్యాక్ కోసం సామ్ ప్లాన్లు వేసుకుంటోంది. తన బెస్ట్ ఫ్రెండ్ దర్శకురాలు నందిని రెడ్డికి ఓకే చెప్పడం చూశాం. కానీ దీనికన్నా ముందే సామ్ ఒక సినిమాలో క్యామియో రూపంలో కనిపించనుంది. అదే అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేస్తున్న పరదా.
ఈ సినిమాలో సామ్ ఒక కీలక పాత్ర చేస్తోందని, క్యారెక్టర్ గెటప్ రెండూ విభిన్నంగా గతంలో చూడని తరహాలో ఉంటాయని టీమ్ నుంచి అందుతున్న సమాచారం. కొన్ని వారాల క్రితం రిలీజైన టీజర్ లో పరదా కంటెంట్ షాకింగ్ గా ఉండబోతోందనే క్లూస్ ఇచ్చారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ విలేజ్ థ్రిల్లర్ లో దర్శన రాజేంద్ర, సంగీతలకు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కాయి. వీళ్లకు సమంతకున్న కనెక్షన్ ఏంటనేది సినిమాలోనే చూడాలని అంటున్నారు. సో అఫీషియల్ కంబ్యాక్ గా సామ్ కు పరదానే నిలవనుంది. విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు కానీ వేసవిలోనే రాబోతోంది.
ఇదలా ఉంచితే సమంత తర్వాత ఏం చేయనుందనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. రామ్ చరణ్ 17 కోసం దర్శకుడు సుకుమార్ తన పేరుని పరిశీలిస్తున్నట్టు వచ్చిన వార్త పుకారేనని ఆ టీమ్ వర్గాలు చెబుతున్న మాట. స్క్రిప్ట్ లాకయ్యే దశలో హీరోయిన్ వేట జరుగుతుందని, అప్పటిదాక ఇవన్నీ ఊహాగానాలుగానే చూడాలని అంటున్నారు. ఇక సిటాడెల్ సీజన్ 2 ఉంటుందో లేదో అనేది అనుమానంగానే ఉంది. ఆర్థిక కారణాల వల్ల బ్రేక్ పడిన వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ త్వరలోనే కొనసాగబోతోందట. సమంతాకి ఇది చాలా ముఖ్యం. సరికొత్త హారర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారట.