బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు ఇప్పటికే రెండుసార్లు పెళ్లయింది. ముందుగా తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమిర్.. 2002లో ఆమె నుంచి విడిపోయాడు. కొన్నేళ్లకు కిరణ్ రావును పెళ్లాడిన అతను.. ఆమె నుంచి కూడా నాలుగేళ్ల కిందట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా 60వ పడికి చేరువ అవుతున్న ఆమిర్.. మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా ఇటీవల వార్తలు మొదలయ్యాయి. అతను బెంగళూరుకు చెందిన ఒక మహిళతో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్లు వినిపించాయి. దీని గురించి తొలిసారిగా ఆమిర్ స్పందించాడు.
తాను డేటింగ్‌లో ఉన్న మాట వాస్తవమే అని ఆమిర్ వెల్లడించాడు. తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసిన ఆమిర్.. తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయ్యాడు. గౌరీ స్ప్రాట్ అనే బెంగళూరుకు చెందిన తన స్నేహితురాలితో తాను ఏడాదిగా డేటింగ్ చేస్తున్నట్లు ఆమిర్ తెలిపాడు. గౌరీ తనకు 25 ఏళ్లుగా తెలుసని.. ఆమె తనకు మంచి స్నేహితురాలని ఈ సందర్భంగా ఆమిర్ చెప్పాడు. గౌరీకి ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మొత్తానికి ఆమిర్ తన కొత్త రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అయిపోవడంతో ఇక ఊహాగానాలకు తెరపడినట్లే.
త్వరలోనే పెళ్లి వార్తతో ఆమిర్ పలకరిస్తాడేమో చూడాలి. ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం గురించి ఆమిర్ చెబుతూ.. దీనికి సంబంధించిన రీసెర్చ్ జరుగుతోందని చెప్పాడు. స్క్రిప్ట్ వర్క్ కోసం ఒక టీంను ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోందని.. భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టు చేయాలనుకుంటున్నామని ఆమిర్ తెలిపాడు. తాము ఎన్నో విషయాలను అన్వేషించే ప్రయత్నంలో ఉన్నామని.. ఏం జరుగుతుందో చూడాలని ఆమిర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు మన దర్శక ధీరుడు రాజమౌళికి సైతం మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే. మరి రాజమౌళి, ఆమిర్‌ల్లో ఎవరు ఈ మెగా మూవీని పట్టాలెక్కిస్తారో చూడాలి.