ఇవ్వటంలో ఉండే ఆనందం అందరికి అర్థం కాదు. నలుగురికి సాయం చేసే ఛాన్సు దొరికితే కొందరు మాత్రమే ఆ దిశగా ఆలోచిస్తారు. ఇప్పుడు అలాంటి ఆలోచనను బయటపెట్టిన వర్థమాన నటుడు కిరణ్ అబ్బవరం అందరి మనసు దోచేశారని చెప్పాలి. తనకు పేరు ప్రఖ్యాతుల్ని ఇచ్చిన ఇండస్ట్రీకి తన వంతుగా ఏమైనా చేయాలన్న తపనకు నిలువెత్తు రూపంగా నిలుస్తుంది తాజాగా ఆయన చెప్పిన మాట.‘క’ మూవీతో సక్సెస్ కొట్టేసిన కిరణ్ అబ్బరం తాజా మూవీ ‘దిల్ రూబా’. ఈ శుక్రవారం విడుదలయ్యే ఈ మూవీని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ తాజాగా జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు ఆయన మీద అందరి చూపు పడేలా చేసిందని చెప్పాలి.
సినిమాలలో ఛాన్సు రావటం చాలా కష్టమని..ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకోరని చెప్పారు. సినిమాల మీద ఎవరికి నమ్మకం ఉండదని.. ఇండస్ట్రీకి వచ్చి స్థిరపడాలని వచ్చి.. అవకాశాల్లేక తిరిగి వెళ్లే ఎందరినో తాను చూసినట్లు చెప్పారు. తాను పరిశ్రమలో స్థిరపడితే.. అవకాశాల కోసం వచ్చే వారికి సాయం చేయాలని తాను ఎప్పటి నుంచో అనుకున్నట్లు చెప్పిన కిరణ్ అబ్బవరం.. ‘ఈ రోజు అభిమానుల దయతో నాకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అందుకే సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు పడే 10 మందికి సాయం చేయాలని డిసైడ్ అయ్యా.
ప్రతి ఏటా అలాంటి పది మందికి అన్ని వసతులు సమకూరేలా చేస్తా. ఫ్యూచర్ లో మరింత ఎదిగితే 100 మందిని అయినా చూసుకోవటానికి సిద్ధంగా ఉన్నా. ఇది నా బాధ్యతగా భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. కిరణ్ అబ్బవరం మాటలు విన్న వారంతా ఫిదా అవుతున్నారు. ఇలాంటి ఆలోచనను షేర్ చేసుకున్న హీరో అతడేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన కొందరు సాయం చేస్తున్నా. . చాలామందిలో అలాంటి ఆలోచనలు ఉండవని.. అందుకు భిన్నంగా కిరణ్ స్పందించిన తీరు మంచి సంప్రదాయానికి తెర తీస్తుందని చెబుతున్నారు.
ఇండస్ట్రీకి కొత్త తరం రావాలని.. ప్రతిభావంతులకు అవకాశాలు రావాలన్నదే తన ఆలోచనగా చెప్పారు. కొత్త దర్శకులతో సినిమాలు చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ప్రతి సినిమాలోనూ 40-50 మంది కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వటానికి తాను ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారు. ఒక మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టిన కిరణ్ అబ్బవరం రానున్న రోజుల్లో మరింత సక్సెస్ సాధించటమే కాదు.. ఇండస్ట్రీకి వచ్చే వారికి అండగా నిలవాలని కోరుకుందాం.
This post was last modified on March 12, 2025 3:34 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…