ఒక్కోసారి దర్శకుల్లో ఎంత ప్రతిభ ఉన్నా ఒక్క డిజాస్టర్ లేదా ఫ్లాప్ వాళ్ళ కెరీర్ నే మారుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల ఆ కోవలోకే చెందుతారు. కొత్త బంగారు లోకంతో ఇండస్ట్రీకి వచ్చి డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకోవడం చిన్న విషయం కాదు. రెండో సినిమాకే టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ అని చెప్పుకునే వెంకటేష్ మహేష్ బాబులని ఒప్పించే ఫ్యామిలీ కథ రాసుకోవడం ఎందరో మహామహుల వల్లే కాలేదు. ఈ కారణంగానే వరుణ్ తేజ్ ని లాంచ్ చేయాలనుకున్నప్పుడు ఆ బాధ్యతని శ్రీకాంత్ చేతిలో పెట్టారు. దానికతను బ్లాక్ బస్టర్ ఇవ్వలేదు కానీ హీరోలో విషయముందనే సందేశాన్ని ఇండస్ట్రీ, ప్రేక్షకులకు ఇవ్వగలిగాడు.
కానీ ఒక్క బ్రహ్మోత్సవం మొత్తం తలకిందులు చేసింది. మహేష్ బాబు ఎంతో నమ్మకంతో ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ చాలా చేదు ఫలితాన్ని ఇచ్చింది. దెబ్బకు ఆరు సంవత్సరాలకు పైగా పరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నారప్ప రీమేక్ చేసినప్పటికీ ఆది ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ కావడంతో ప్రత్యేకంగా అతని ప్రతిభ హైలైట్ కాలేదు. ఇక పెదకాపు గురించి చెప్పనక్కర్లేదు. భారీ బిల్డప్ తో వచ్చిన ఈ విలేజ్ డ్రామా మరీ దారుణంగా పోయింది. ఇక్కడితో శ్రీకాంత్ అడ్డాల చాప్టర్ క్లోజనే అందరూ అనుకున్నారు. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ అతనిలో కొత్త ఆశలు చిగురించేలా చేసిందని ఇన్ సైడ్ టాక్.
గోదావరి నేపథ్యంలో అలాంటి అందమైన ఎమోషన్స్ ఉన్న కథ ఏదైనా ఉంటే చెప్పమని ఓ యూత్ హీరో అడుగుతున్నట్టు సమాచారం. అన్నీ సవ్యంగా జరిగి కోరుకున్న రీతిలో స్టోరీ కనక కుదిరితే శ్రీకాంత్ అడ్డాలతో చేయడానికి కిరణ్ అబ్బవరం సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ఈ కారణంగా ఇద్దరు పలుమార్లు కలుసుకున్నారట. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ మొదటి రోజు చూడటమే కాక దానికి ముందు దిల్ రుబా ఈవెంట్లో కిరణ్ ప్రత్యేకంగా శ్రీకాంత్ ని మెచ్చుకోవడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. అయితే కంటెంట్ కరెక్ట్ గా వస్తేనే ఈ కాంబో కార్యరూపం దాలుస్తుందని అంతర్గత వర్గాలంటున్నాయి.
This post was last modified on March 13, 2025 9:14 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…