డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ విడుదల ఎప్పుడనేది ఇంకా తేలలేదు కానీ టీమ్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్విరామంగా చేస్తూనే వస్తోంది. ఇంకా మూడు పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉందని సమాచారం. షూట్ కొంత భాగం ఇంకా తీయాల్సి ఉంది. ఫౌజీ నుంచి ప్రభాస్ బ్రేక్ తీసుకుని రాగానే దీన్ని కొనసాగించబోతున్నారు. రిలీజ్ డేట్ సంగతి పక్కనపెడితే వచ్చే నెల టీజర్ ని భారీ ఎత్తున లాంచ్ చేసే దిశగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సన్నాహాల్లో ఉన్నట్టు తెలిసింది. ప్రాజెక్టు గురించి జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టే విధంగా ఈవెంట్ ప్లాన్ చేస్తారని తెలిసింది.
ఇక అసలు విషయానికి వస్తే ది రాజా సాబ్ లో చాలా ట్విస్టులు ఉంటాయనేది తెలిసిన విషయమే అయినా కీలకమైన ఒక ట్విస్టు ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం ఖాయం. లీక్స్ ప్రకారం ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. టీమ్ అఫీషియల్ గా విడుదల చేసిన సిగరెట్ తాగే పోస్టర్ లో ఉన్నది ఠాగూర్ సాబట. అంటే ఆ బంగాళా యజమాని. రెండో క్యారెక్టర్ యంగ్ ప్రభాస్ అంటే టైటిల్ రోల్ చేస్తున్న ది రాజా సాబ్. వీళిద్దరి మధ్య సంబంధం తండ్రి కొడుకని వేరే చెప్పనక్కర్లేదు. తాతయ్యగా సంజయ్ దత్ దర్శనమిస్తాడు. ఈ ముగ్గురి మధ్య జరిగే కీలకమైన హారర్ డ్రామానే రాజా సాబ్ కోర్ పాయింట్ గా చెబుతున్నారు.
ఇది పక్కాని చెప్పలేం కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం టీజర్ లో దీని తాలూకు శాంపిల్స్ చూపించబోతున్నారు. నిధి అగార్వల్ తో పాటు మాళవిక మోహనన్ పాత్రలకు సంబంధించిన మలుపులు షాకింగ్ గా ఉంటాయట. తమన్ ఇచ్చిన పాటల్లో మూడు సాంగ్స్ పూర్తిగా మాస్ ని టార్గెట్ చేసుకుని మిర్చి నాటి ప్రభాస్ ని గుర్తు చేసేలా మరిపిస్తాయని తెలిసింది. ఈ ఏడాది ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు ది రాజా సాబ్ టీజర్ వేడుకలో ఖచ్చితంగా సమాధానం దొరకాలి. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి వీలైనంత సోలో డేట్ కోసం మేకర్స్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు కొలిక్కి వస్తాయో వచ్చే నెల తేలొచ్చు.
This post was last modified on March 12, 2025 12:28 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…