ఇంత సన్నని దారం దొరికితే చాలు పెద్ద వస్త్రం కుట్టేయడం బాలీవుడ్ వర్గాల్లో సర్వ సాధారణం. కాకపోతే ఈసారి టాపిక్ తెలుగు హీరోయిన్ ముడిపడి ఉంది కాబట్టి దీని ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది. ఇటీవలే జరిగిన ఐఫా 2025 అవార్డుల్లో కార్తీక్ ఆర్యన్ కు భూల్ భులాయ్యా 3 పెర్ఫార్మన్స్ కు గాను అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అతని తల్లిని నిర్మాత కరణ్ జోహార్ ఒక సరదా ప్రశ్న అడిగాడు. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారని. దానికావిడ బదులు చెబుతూ ఇంట్లో డాక్టర్ ని డిమాండ్ చేస్తున్నారని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీలీలకు దీనికి కనెక్షన్ ఏంటో చూద్దాం.
టాలీవుడ్ టాప్ కుర్చీ పోటీలో ఉన్న శ్రీలీల హిందీ డెబ్యూ కార్తీక్ ఆర్యన్ తో జరుగుతున్న సంగతి తెలిసిందే. తను ఎంబిబిఎస్ చేస్తున్నది కూడా ఓపెన్ సీక్రెట్. ఈ పరీక్షల కోసమే గుంటూరు కారం తర్వాత పెద్ద బ్రేక్ తీసుకుంది. ఇంకేముంది కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ కోరుకుంటున్నది శ్రీలీలనేని కొన్నిమీడియా కథనాలు వండి వడ్డించేశాయి. ఈ డౌట్ కరణ్ స్టేజి మీదే తీర్చాడు. నువ్వు నటిస్తోంది డాక్టర్ తోనే కదా అంటే దానికి కార్తీక్ ఆర్యన్ సమాధానమిస్తూ వాళ్ళు అడుగుతున్నది పనిచేసే ఆసుపత్రి వైద్యురాలినని, సినిమాల్లో నటించే డాక్టర్ కాదని క్లారిటీ ఇవ్వడంతో సందేహాలు తీరిపోయాయి.
ఆ వేడుకకు సంబంధించిన వీడియో పూర్తిగా చూస్తే తప్ప ఈ క్లారిటీ రాదు. అఫీషియల్ గా ఇంకా స్ట్రీమింగ్ మొదలవ్వని ఐఫా 2025 ఈవెంట్ లో చాలా విశేషాలు జరిగాయి. షారుఖ్ ఖాన్, మాధురి దీక్షిత్ కలిసి దిల్ తో పాగల్ హైకు పాతికేళ్ల క్రితంలాగే అదిరిపోయే లైవ్ డాన్స్ చేయడం వాటిలో ఒకటి. వేడుకకు హాజరైన వాళ్ళు తీసిన సెల్ ఫోన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలయ్యింది. ప్రస్తుతం తెలుగులోనే చాలా డిమాండ్ ఉన్న శ్రీలీల బాలీవుడ్ లోనూ ఋజువు చేసుకోవాలని పరుగులు పెడుతోంది. కార్తీక్ ఆర్యన్ తో చేస్తోంది ఆషీకీ 3 అనే ప్రచారం ఉంది కానీ ఇప్పటిదాకా టైటిల్ అయితే ప్రకటించలేదు.
This post was last modified on March 12, 2025 11:49 am
ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్, దరువు లాంటి సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న తాప్సి కొన్నేళ్లుగా పూర్తిగా బాలీవుడ్ కే…
ఇంకో 22 రోజుల్లో ప్యారడైజ్ ఆగమనం జరగనుంది. వచ్చే వారం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టనుండగా తెలుగు రాష్ట్రాల్లో జీవోలు,…
అంతా అనుకున్నట్లే అయ్యింది. మొదట్నుంచి ప్రచారం జరుగుతున్నట్టే మంత్రి కొండా సురేఖ మీద వేటు పడింది. ఆమె రాజీనామా చేయడానికి…
30 ఏళ్లకుపైగా తాను నడిపిన బస్సుకు ఓ డ్రైవర్ భావోద్వేగ వీడ్కోలు పలికిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.…
హిందీ నిర్మాతలు అత్యధిక శాతం ఎనిమిది వారాల ఓటిటి విండోని ఖచ్చితంగా పాటిస్తారు. అంటే థియేటర్ లో విడుదలైన యాభై…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకా విడుదల తేదీ జనవరి 13 ఆల్రెడీ ప్రకటించిన సంగతి…