నిన్న రాబిన్ హుడ్ నుంచి అదిదా సర్ప్రైజ్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. కేతిక శర్మ నటించిన ఈ ప్రత్యేక గీతంలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరోసారి డిస్కషన్ టాపిక్ గా మారింది. వెరైటీ కోసమో లేక యూత్ ని ఇలా అయితేనే ఆకట్టుకోగలమనే నమ్మకమో తెలియదు కానీ ఆయన కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు విమర్శలు తెస్తున్న దాఖలాలు లేకపోలేదు. మిస్టర్ బచ్చన్, డాకు మహారాజ్ టైంలో వచ్చిన నెగటివిటీ ఎంతో కొంత పబ్లిసిటీకి ఉపయోగపడింది కానీ ఆ హీరోల రేంజుకు అలాంటి వైరల్ ప్రమోషన్లు అవసరం లేదు. కాకపోతే అనుకోకుండా జరిగిన సోషల్ మీడియా ప్రచారం వల్ల చర్చలోకి వచ్చాయి.
ఇప్పుడీ రాబిన్ హుడ్ పాట కూడా వీటి సరసన చేరిపోయింది. సమస్య ఎక్కడొస్తుందంటే ఇలాంటి స్టెప్పులు పాపులరయ్యాయంటే రియాలిటీ డాన్స్ షోలు, ఇన్స్ టా రీల్స్ లో వీటిని అనుకరించే వాళ్ళు ఎక్కువైపోతారు. ముందు ముందు నృత్య దర్శకులు సైతం ఇవే ట్రెండ్ కాబోలని భావించి అలాంటివే ట్రై చేసే అవకాశాలు లేకపోలేదు. ఇదంతా పాజిటివ్ గా మారితే పర్వాలేదు కానీ నెగటివ్ అయితేనే ఇబ్బంది. ఇప్పటికే మూడు సాంగ్స్ మీద ఒకే తరహా ఫీడ్ బ్యాక్ వచ్చింది కాబట్టి శేఖర్ మాస్టర్ సరిచేసుకోవాలనేది నెటిజెన్ల నుంచి వచ్చిన కామెంట్. ఏమైనా ఫలానా పాట ఉందనే టాక్ త్వరగా వెళ్ళిపోయిన మాట వాస్తవం.
దర్శకుడు వెంకీ కుడుముల గతంలో తీసిన ఛలో, భీష్మకు ఇలా జరగలేదు. వాటిని మించి రాబిన్ హుడ్ లో ఫన్ యాక్షన్ ఉంటాయని ఆయనిస్తున్న ధీమాకు అనుగుణంగానే నితిన్ ఈ సినిమా మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మ్యాడ్ స్క్వేర్, వీరధీరశూర పార్ట్ 2, ఎల్2 ఎంపురాన్ రూపంలో పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో గ్యారెంటీ హిట్టని చెబుతున్నాడు. ఇప్పటిదాకా రిలీజైన జివి ప్రకాష్ కుమార్ పాటలు మెల్లగా ఎక్కేస్తున్నాయి. అదిదా సర్ప్రైజు కొంచెం ఫాస్ట్ గా వెళ్లేలా ఉంది. పుష్ప 2లో శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తే ఇప్పుడు శ్రీలీల మెయిన్ హీరోయిన్ సినిమాలో కేతిక శర్మ ఆడిపాడింది.
This post was last modified on March 11, 2025 11:58 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…