హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ వేసేవారు కానీ.. ‘చంద్రముఖి’ తర్వాత పరిస్థితి మారిపోయింది. అందులో జ్యోతిక దయ్యం పాత్రలో అద్భుత అభినయంతో ప్రశంసలు అందుకోవడంతో మంచి పెర్ఫామెన్స్ ఇవ్వడానికి ఈ పాత్రలు మంచి ఛాయిస్ అని హీరోయిన్లు భావించి వీటికి ఓకే చెప్పడం కామన్ అయింది. నయనతార, తమన్నా సహా ఎంతోమంది స్టార్ హీరోయిన్లు దయ్యాల పాత్రలు పోషించారు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’లో ప్రభాస్ సైతం దయ్యంగా కనిపించనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం దయ్యం క్యారెక్టర్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.కానీ ఆ ప్రచారాన్ని నిధి ఖండించింది. తాను ‘రాజా సాబ్’లో చేస్తున్నది దయ్యం క్యారెక్టర్ కాదని ఆమె స్పష్టం చేసింది. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో తన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందని ఆమె చెప్పింది. అదే సమయంలో అది రెగ్యులర్ గ్లామర్ క్యారెక్టర్ కాదని చెప్పిన నిధి.. ఇందులో పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంటుందని నిధి తెలిపింది.
ఇక తాను నటిస్తున్న మరో భారీ చిత్రం హరిహర వీరమల్లు గురించి నిధి మాట్లాడుతూ.. ‘‘ఇదొక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. పవన్ కళ్యాణ్ గారితో నటించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. ఆయన ఒక మేధావి. సాహిత్యం మీద ఎంతో పట్టు ఉంది. పవన్ గారు డిప్యూటీ సీఎం కాకముందే ఆయనతో షూటింగ్ చేశాను. ఎన్నికల సమయంలో బిజీగా ఉండడంతో షూటింగ్ ఆగింది. డిప్యూటీ సీఎం అయ్యాక మళ్లీ చిత్రీకరణలో పాల్గొన్నారు. కానీ అప్పటికి, ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ అలాగే ఉన్నారు’’ అని నిధి పేర్కొంది.
This post was last modified on March 11, 2025 5:28 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…