దర్శకధీర రాజమౌళి ఫిల్మోగ్రఫీలో ఈగది చెక్కుచెదరని స్థానం. మగధీర లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత అసలు స్టార్లే లేకుండా జక్కన్న తీసిన సినిమాలు రెండు. మొదటిది మర్యాద రామన్న ఘనవిజయం అందుకోగా ఈగ ఏకంగా రికార్డులు బద్దలు కొట్టింది. అయితే దీనికి సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా రాజమౌళి ఆ దిశగా ఆలోచన చేయలేదు. పైగా బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా మార్కెట్ అంతకంతా పెరిగిపోవడంతో మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఈగ 2 టైటిల్ కాదు కానీ అచ్చం అదే తరహా గ్రాఫిక్స్ తో తమిళ తెలుగులో ఒక సినిమా రాబోతోంది. అదే లవ్లీ.
మాథివ్ థామస్ హీరోగా దినేష్ కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన లవ్లీ ట్రైలర్ నిన్న వచ్చింది. థియేటర్లలో ఏప్రిల్ 4 సినిమాని విడుదల చేయబోతున్నారు. కథేంటో చెప్పేశారు. ఒక చిన్న ఈగకు ఓ యువకుడితో స్నేహం కుదురుతుంది. అతనితో దోస్తీ చేసి ఎన్నో విషయాలు పంచుకుంటుంది. హీరోకు ఏదైనా సమస్య వస్తే సలహాలు ఇస్తుంది. ఇబ్బందుల్లో పడితే ఆదుకుంటుంది. మరి వీళిద్దరి ఫ్రెండ్ షిప్ లో విలన్ ఎవరు, హీరోయిన్ ఎక్కడుంది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడమంటున్నారు. స్టోరీ ఎక్కువ రివీల్ కాకుండా జాగ్రత్తగా కట్ చేశారు కానీ ట్రైలర్ లో చెబుతారేమో చూడాలి.
విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ అచ్చం ఈగలాగే ఉన్నాయి. డిజైన్ కూడా ఏ మాత్రం మార్చకుండా యధాతథంగా దించేశారు. ఈగ 2 అని టైటిల్ పెడితే యాప్ట్ అనిపించేలా ఉంది. నటీనటులు, సాంకేతిక వర్గం అంతా మనకు పెద్దగా పరిచయం లేని బాపతే. కానీ తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయినా ఈగ 2 ని నిజంగా రాజమౌళి తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. కానీ ఇప్పుడీ లవ్లీలో ఈగ విఎఫ్ఎక్స్ తప్ప మిగిలినదంతా అంత కిక్ ఇచ్చేలా ఏం లేదు. అసలే డబ్బింగ్ రూపంలో వస్తోంది. మరి ఏ మేరకు కనెక్ట్ అవుతుందో వేచి చూడాలి.
This post was last modified on March 10, 2025 10:00 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…