‘బిగ్‍బాస్’ షోలో లెక్కలు ప్రతి వారానికీ మారిపోతుంటాయి. ఆడియన్స్ ఎవరిపై ఎందుకు చిరాకు పడతారో, ఎందుకని ఒకరిపై కోపం పెంచుకుంటారో, ఎవరిని ద్వేషిస్తారో, ఎందుకు ప్రేమిస్తారో చెప్పడం చాలా కష్టం. మొదటి మూడు వారాలలో అతి చేస్తోందని అసహ్యించుకున్న వాళ్లే పాపం ఒంటరిగా వుందంటూ ఏడవ వారంలో సింపతీ చూపిస్తుంటారు. ఈ గేమ్‍లో అతి కీలకమైన అంశం… ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్.
హౌస్‍లో మనకు ఏమి జరిగిందనేది రోజులో ఒక గంట మాత్రమే చూపిస్తారు. కానీ ఆ మిగతా టైమ్‍లో ఏమి జరుగుతుంది, ఎవరెలాంటి వాళ్లు అనేది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల ద్వారానే తెలుస్తుంది. ఆ ఇంటర్వ్యూలు ఫాలో అయ్యే కొద్దీ హౌస్‍లో వున్నవారిపై అభిప్రాయాలు మారిపోతూ వుంటాయి. అలాగే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లకు అంతదాకా ఓటేసిన వాళ్లు ఇప్పుడు కొత్త వారికి ఓట్లు వేయడం మొదలు పెడతారు. ఈ స్వింగ్ ఎటు వెళుతుందనేది చాలా కీలకం అవుతుంది.
హౌస్‍లో జనం తగ్గే కొద్దీ బయట ఓటర్లు పెరుగుతూ వెళ్లాలి. ఎందుకంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల ఓట్లు లోపల వున్న వాళ్లు తమ వైపు తిప్పుకోగలగాలి. అప్పుడే విజేతగా నిలిచే వీలుంటుంది. బయటకు పోతున్న వారితో సమస్యలుంటే వాళ్లు వెళ్లే ముందే క్లియర్ చేసేసుకుంటే మంచిది. లేదంటే వాళ్లు బయటకు వచ్చి మరింత బ్యాడ్ చేసేసే ప్రమాదముంటుంది. మిగతా సీజన్ల కంటే ఈ స్వింగ్ ఓట్ ఈ సీజన్లో కీలకం కానుంది. ఎందుకంటే ఈసారి గ్యారెంటీ విన్నర్ అనిపించే ఒక్క పాపులర్ సెలబ్రిటీ కూడా లేకపోవడంతో ఎనిమిదవ వారంలోకి ఎంటరైనా కానీ ఇంకా ఎవరు విజేత అనేదానిపై క్లారిటీ రాలేదు.
This post was last modified on October 27, 2020 2:36 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…