దిల్ రాజు బ్యానర్ లో జాతీయ అవార్డు సాధించడంతో పాటు కమర్షియల్ గానూ విజయం అందుకున్న శతమానం భవతికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి కొనసాగింపు తీయాలని రాజు గారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు కానీ కథ విషయం ఒక కొలిక్కి రాకపోవడంతో ఆలస్యమవుతోంది. నిన్న ఏడాది శతమానం భవతి నెక్స్ట్ పేజీ అంటూ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అందులో పేర్కొన్నారు. నటీనటులు, దర్శకుడు ఎవరో చెప్పకుండానే అంత కాన్ఫిడెంట్ గా ప్రకటన ఇచ్చారంటే చిన్న విషయం కాదు. కానీ దాని స్థానంలో సంక్రాంతికి వస్తున్నాంని తీసుకొచ్చారు.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం శతమానం భవతి నెక్స్ట్ పేజీకి అడుగులు పడుతున్నాయట. తమ కాంపౌండ్ హీరో ఆశిష్ తో తెరకెక్కించాలనేది దిల్ రాజు ఆలోచన. పెద్ద బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నప్పటికీ అతని కెరీర్ సరైన దిశలో వెళ్లట్లేదు. రౌడీ బాయ్స్ ఫ్లాప్ అయ్యింది. లవ్ మీ ఇఫ్ యు డేర్ దారుణంగా పోయింది. సుకుమార్ కథను ఇచ్చిన సెల్ఫిష్ మధ్యలో ఆగిపోయి రిపేర్ల పనిలో పడింది. వీటికన్నా ఏదైనా హోమ్లీ ఎంటర్ టైనర్ అయితే త్వరగా ప్రేక్షకులకు రీచ్ అవుతాడనే ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. తొలి భాగం తీసిన సతీష్ వేగ్నేశ దర్శకుడిగా ఉండకపోవచ్చట.
ఆయన స్థానంలో కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారని వినిపిస్తోంది. 2026 సంక్రాంతికి తనకో స్లాట్ ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. అది పెద్ద సినిమానా లేక శతమానం భవతి 2నా అనేది ఇప్పటికిప్పుడు తేలదు కానీ ఎంత కాంపిటేషన్ ఉన్నా సరే ఒకటి ఖచ్చితంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికైతే చిరంజీవి – అనిల్ రావిపూడి, జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలు ఫిక్సయ్యాయి. రవితేజ – కిషోర్ తిరుమల కూడా ఇదే సీజన్ టార్గెటట. ఒకవేళ శతమానం భవతి నెక్స్ట్ పేజీ కూడా తోడైతే పోటీ ఆసక్తికరంగా మారుతుంది. ముందైతే ప్రాజెక్టు ముందుకెళ్లాలి.
This post was last modified on March 9, 2025 11:55 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…