మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆయనతో పాటు ఇంకో నలుగురు సంతానం అన్న సంగతి తెలిసిందే. నాగబాబు, పవన్ కళ్యాణ్‌లకు తోడు ఇద్దరు సోదరీమణులున్నారు. ఐతే వీరితో పాటు చిరు తల్లిదండ్రులకు ఇంకో ముగ్గురు సంతానం కూడా కలిగారట. కానీ ఆ ముగ్గురూ రకరకాల కారణాలతో చనిపోయిన విషయాన్ని చిరు ‘ఉమెన్స్ డే’ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను ఆరో తరగతిలో ఉండగా తన సోదరి చనిపోవడంతో తమ కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి ఆయన ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
‘‘అమ్మకు ఇప్పుడు మేం అయిదుగురు బిడ్డలం. కానీ మరో ముగ్గురు చిన్న వయసులోనే చనిపోయారు. నాన్న ఉద్యోగరీత్యా పనుల్లో బిజీగా ఉంటే అమ్మే అన్నీ చూసుకునేది. నేను చిన్నప్పటి నుంచి అమ్మకు పనుల్లో సాయం చేస్తుండేవాడిని. నేను ఆరో తరగతిలో ఉండగా రమ అనే నా సోదరి అనారోగ్యం పాలైంది. దీంతో తనను నేను, అమ్మ కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లాం. నాన్నకు విషయం తెలియదు. రెండు రోజుల తర్వాత నా సోదరి చనిపోయింది. తనను చేతుల్లోకి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాం. చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో తర్వాతి కార్యక్రమాలు పూర్తి చేశాం. తెలిసిన వారి ద్వారా నాన్నకు సమాచారం తెలిసింది. కానీ ఆయన వచ్చేసరికే అంతా అయిపోయంది. ఆ క్షణాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది’’ అని చిరు వెల్లడించారు.
ఇక తాను మూడేళ్ల వయసున్నపుడు తప్పిపోయిన విషయాన్ని కూడా చిరు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘సరదాగా ఆడుకుంటూ రోడ్డు మీదికి వచ్చేసి.. ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తూ రోడ్డు మీదే కూర్చుండిపోయాను. అక్కడే ఉన్న ఒకాయన నన్ను చూసి తన కొలిమి దగ్గరికి తీసుకెళ్లారు. ఇంట్లో వాళ్లకు కబురు చేశారు. అమ్మ వచ్చేసరికినేను ఒళ్లంతా మసి పూసుకుని కూర్చున్నా. దీంతో అమ్మ నన్ను చూసి గుర్తు పట్టలేకపోయింది. వీడు మా అబ్బాయి కాదు అని చెప్పేసింది. కానీ తర్వాత ఎందుకో అనుమానం వచ్చి దగ్గరగా చూసి నన్ను గుర్తు పట్టింది. తర్వాత ఇంటికి తీసుకెళ్లితాళ్లతో కట్టేసిందట’’ అని చిరు చెప్పారు.
This post was last modified on March 9, 2025 4:56 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…