వాణిజ్య ప్రకటనల్లో స్టార్ హీరోలు నటించడం కొత్తేమీ కాదు. మహేష్ బాబు ఎన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడో అభిమానులే ఠక్కున చెప్పలేరు. జూనియర్ ఎన్టీఆర్ ఆ మధ్య ఆర్ఆర్ఆర్ టైంలో యాడ్స్ చేయలేదు కానీ తాజాగా మళ్ళీ మొదలుపెట్టాడు. అందులో భాగంగా నిన్న ఆన్ లైన్ సరుకులను డెలివరీ చేసే జెప్టో యాడ్ లో కనిపించాడు. డైరెక్టర్ కొంచెం ఎక్కువ క్రియేటివిటీ చూపించడంతో వీడియో వెరైటీగా అనిపించింది. అయితే అధిక శాతం మాట్లాడుకున్న అంశం జూనియర్ హెయిర్ స్టైల్, లుక్స్ గురించే. సోషల్ మీడియాలో ఎక్కువగా యాంటీ ఫ్యాన్స్ నెగటివిటీ కనిపించడం చర్చకు దారి తీసింది.
నిజానికి తారక్ ఇప్పుడు వార్ 2 చివరి దశ షూటింగ్ లో ఉన్నాడు. బయట ఎయిర్ పోర్ట్స్, ఫంక్షన్లలో కనిపించడం పక్కనపెడితే ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం ప్రత్యేకమైన లుక్స్ మైంటైన్ చేస్తున్నాడు. అవి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇటీవలే హృతిక్ రోషన్ తో కలిసి పాట డాన్స్ లో పాల్గొంది కూడా దీంతోనే. ఇలాంటి టైంలో జెప్టో షూట్ రావడంతో ఏదోలా మేనేజ్ చేసుకుని కొంచెం కొత్తగా ట్రై చేద్దామని క్రాఫు మార్చిన జుత్తుతో కనిపించాడు. కానీ ఆశించినంత పాజిటివ్ గా వెళ్ళలేదు. మాములుగా ఎంత యాడ్ అయినా సరే లుక్ టెస్ట్ చేస్తారు. మరి దీని విషయంలో సీరియస్ గా చూడలేదేమో.
ఇదంతా పక్కనపెడితే కేవలం కొన్ని సెకండ్ల పాటు వచ్చే యాడ్ మీద ఇంత శల్యపరీక్ష అవసరమా అంటే లేదనే చెప్పాలి. ఆ మధ్య చిరంజీవి ఒక పాల ప్యాకెట్ల ప్రకటనలో మాస్ గా కనిపిస్తే దాని మీద కూడా కామెంట్స్ వచ్చాయి. అభిమానులు మరీ ఎక్కువ ఊహించుకోవడమో లేదా యాంటీ ఫ్యాన్స్ అవసరానికి మించి ట్రోలింగ్ కు దిగడమో చేసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడొచ్చిన జెప్టో యాడ్ ఇంకా మొదటిదేనట. రెండోది త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. వార్ 2 ప్రమోషన్లు వేసవిలో మొదలుపెట్టబోతున్నారు. అప్పుడు అందరి డౌట్లు జూనియర్ తీర్చేయొచ్చు.
This post was last modified on March 8, 2025 5:28 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…