Movie News

స్ట్రెయిట్ సినిమాల తీరు – డబ్బింగ్ చిత్రాల జోరు

2025 కొత్త సంవత్సరంలో దాదాపు రెండున్నర నెలలు గడిచిపోయాయి. బాక్సాఫీస్ పరంగా ఫలితాలు విశ్లేషించుకుంటే జనవరి నుంచి మార్చి దాకా వచ్చిన సినిమాల్లో స్ట్రెయిట్ తో సమానంగా డబ్బింగ్ చిత్రాలు పోటీ పడటం ఒకపక్క ఆనందం, మరోపక్క ఆందోళన కలిగించేదే. జనవరిలో ‘మార్కో’ మరీ గొప్ప అద్భుతాలు చేయకపోయినా దాని మీద పెట్టిన పెట్టుబడి, థియేటర్ బిజినెస్ కి పెట్టిన సొమ్ముని సేఫ్ గా వెనక్కిచ్చి లాభాలు కూడా పంచింది. ఫిబ్రవరిలో రిలీజైన ‘ది రిటర్న్ అఫ్ ది డ్రాగన్’ కేవలం నాలుగు కోట్లకు అమ్ముడై ఫైనల్ రన్ అయ్యేలోపు దానికి మూడింతల ప్రాఫిట్ నిర్మాతల ముందు పెట్టనుంది.

తాజాగా విడుదలైన ‘ఛావా’కు ఊహించిన దానికన్నా పెద్ద స్పందన దక్కుతోంది. హిందీ వెర్షన్ తో పోల్చుకుంటే ఆలస్యంగా వచ్చినా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్న వైనం కనిపిస్తోంది. బుక్ మై షోలో ఇప్పటికే లక్ష టికెట్ల అమ్మకాలు దాటిపోగా మొదటి రోజు గ్రాస్ మూడు కోట్లను చేరుకుంది. సో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పంట పండినట్టే. ఇవన్నీ అనువాదాలు కాబట్టి రిస్క్ ఫాక్టర్ తక్కువగా ఉంటుంది. ఇక స్ట్రెయిట్ సినిమాల సంగతి చూస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూడు వందల కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాక దాంతో పాటు వచ్చిన ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్ ముద్రతో క్షేమంగా బయటపడింది.

నిన్న నెలలో ‘తండేల్’ వంద కోట్ల గ్రాస్ అందుకుని నాగచైతన్యకు ఊరట కలిగించింది. ఇవి మినహాయిస్తే తెలుగు స్ట్రెయిట్ సినిమాలేవీ మేజిక్ చేయలేకపోయాయి. మంచి అంచనాలు మోసిన మజాకా, బ్రహ్మ ఆనందం, రామం రాఘవం లాంటివి తీవ్రంగా నిరాశపరిచాయి. అలాని డబ్బింగులన్నీ భీకరంగా ఆడాయని కాదు. అజిత్ ‘పట్టుదల’కు కనీసం పబ్లిసిటీ ఖర్చులు రాలేదు. జివి ప్రకాష్ ‘కింగ్స్టన్’ సైతం ఇదే దారిలో వెళ్తోంది. కాకపోతే గత ట్రెండ్స్ దృష్టిలో పెట్టుకుని చూస్తే అనువాదాలు సక్సెస్ రేట్ పెరుగుతున్న మాట వాస్తవం. ఒకరకంగా ఇది వార్నింగ్ బెల్ లాంటిది. మంచి కంటెంట్ ఇవ్వకపోతే ఇవే రిపీటవుతాయి.

This post was last modified on March 9, 2025 5:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

3 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

3 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

3 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

5 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

6 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

6 hours ago