సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటిదాకా సోలో హీరోగా చేసింది కేవలం 28 సినిమాలు. వాటిలో ఒక్క రీమేక్ లేదు. మల్టీస్టారర్స్ లో నటించలేదు. ఒక్క ప్యాన్ ఇండియా మూవీ రాలేదు. అయినా ఒక్కడు, పోకిరి లాంటి రికార్డులు తిరగరాసిన ఇండస్ట్రీ హిట్లున్నాయి. బాబీ, సైనికుడు లాంటి పీడకలలా మిగిలిపోయిన డిజాస్టర్లున్నాయి. కానీ అభిమానులు మాత్రం తమ ప్రేమని విపరీతంగా ప్రదర్శిస్తూనే ఉంటారు. ముఖ్యంగా రీ రిలీజుల టైంలో ఏదో కొత్త సినిమా వస్తోందన్న రేంజ్ లో వాళ్ళు చేసే హడావిడికి కలెక్షన్లు కూడా అంతే భారీగా వస్తున్నాయంటే ఈ అభిమానాన్ని మాటల్లో కొలవడం కష్టమే అనిపిస్తుంది.
ఇప్పటిదాకా రీ రిలీజుల్లో ఫ్లాపు లేని హీరో ఒక్క మహేష్ బాబే. అసలీ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది పోకిరి. తర్వాత ఒక్కడు రెండుమూడు సార్లు రీ రిలీజైనా ఫ్యాన్స్ సంబరంలా జరుపుకున్నాడు,. బిజినెస్ మెన్ కొచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఇక మురారి సంగతి సరేసరి. టీవీలో చూసే బోర్ కొట్టింది కదా ఏం ఆడుతుందిలే అనుకున్న అంచనాలకు భిన్నంగా ఏకంగా టాలీవుడ్ టాప్ రీ రిలీజ్ గ్రాసర్ గా నిలిచింది. తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకొస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. థియేటర్లు ఫంక్షన్ హాళ్లను తలపిస్తున్నాయి. ఓపెనింగ్ డే రెండు కోట్లకు పైగానే గ్రాస్ వచ్చి ఉండొచ్చని ట్రేడ్ రిపోర్ట్.
ఇక్కడితో అయిపోలేదు. అతడుని మహేష్ పుట్టినరోజు కోసం రిజర్వ్ లో ఉంచారు. దీనికొచ్చే వసూళ్లు ఊహించడం కష్టమేనని బయ్యర్లు ఇప్పుడే ఓ రేంజ్ అంచనాలు పెట్టేసుకుంటున్నారు. మేలో అతిథిని దింపబోతున్నారు. ఫ్లాప్ అయినా సరే దీనికో కల్ట్ ఫాలోయింగ్ ఉంది. భవిష్యత్తులో 1 నేనొక్కడినే పునఃవిడుదలకు ఇదే తరహా వాతావరణం కనిపించినా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజమౌళితో చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 వచ్చే లోగా రాజకుమారుడు, టక్కరి దొంగ, యువరాజు, నిజం లాంటివి ఓ రౌండ్ థియేటర్ రన్ పూర్తి చేసుకుంటాయి. నిజంగానే మహేష్ మీద ఇంత ప్రేమ ఏంటో అనిపిస్తోంది కదూ.
This post was last modified on March 8, 2025 12:10 pm
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…