త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎన్టీఆర్‍తోయ అనౌన్స్ అయింది. అయితే ఆ చిత్రం మొదలు కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ పూర్తి చేసినా కానీ ఇక రీషూట్స్ అవసరం పడదని రాజమౌళి నమ్మేవరకు హీరోలు గెటప్ మార్చడానికి వీల్లేదట. అదే జరిగితే త్రివిక్రమ్ సినిమా ఇంకా లేటవుతుంది.
జనవరికి అయినా ఎన్టీఆర్ అందుబాటులోకి వస్తాడని త్రివిక్రమ్ ఎదురు చూస్తున్నాడట. రాని పక్షంలో ఒక మీడియం బడ్జెట్ సినిమా చేసే ఆలోచనలో వున్నాడట. అప్పట్లో నితిన్‍తో ‘అ ఆ’ చేసినట్టు ఈసారి యువ హీరో రామ్‍తో త్రివిక్రమ్ సినిమా చేస్తాడనే పుకార్లు చిత్రపురిలో బాగా వినిపిస్తున్నాయి.
రామ్ కూడా ఇంతవరకు తదుపరి చిత్రం ఏమిటనేది ఓకే చేయకుండా వెయిట్ చేస్తున్నాడు. రెడ్ రిలీజ్ అయిన తర్వాత తదుపరి చిత్రం గురించి ప్లాన్ చేసుకోవచ్చని అతను భావిస్తున్నాడు. అందుకే ఈలోగా తనను అప్రోచ్ అయిన మారుతి, సురేందర్ లాంటి వాళ్లను కూడా రామ్ కాదనేసాడు. ఈ టైమ్‍లో తనకు త్రివిక్రమ్ సినిమా పడితే మిడ్ రేంజ్ స్టార్స్ లో నంబర్‍వన్ పొజిషన్‍కి చేరిపోతాడు.
త్రివిక్రమ్‍కి రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్‍తో చాలా మంచి సంబంధాలున్నాయి. మాటల రచయితగా నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలను ఆయన బ్యానర్లో చేసిన త్రివిక్రమ్… దర్శకుడిగా పరిచయమయింది కూడా స్రవంతి మూవీస్‍లోనే. కృతజ్ఞత తెలుపుకునే ఉద్దేశం వుంటే త్రివిక్రమ్‍కి ఇదే మంచి తరుణం అవుతుంది.
This post was last modified on October 27, 2020 8:06 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…