మొన్న జనవరి నెలలో విడుదలైన మలయాళం మూవీ రేఖా చిత్రం సంచలన విజయం సాధించింది. సంక్రాంతి పోటీ ఉన్నప్పటికీ ఒరిజినల్ వెర్షన్ కు హైదరాబాద్ లో కాసిన్ని స్క్రీన్లు ఇస్తే రోజుల తరబడి హౌస్ ఫుల్స్ పడ్డాయి. కేవలం పది కోట్ల బడ్జెట్ లోపే తీస్తే యాభై కోట్లకు పైగా వసూలు చేసి సెన్సషన్ అయ్యింది. తెలుగు డబ్బింగ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. థియేట్రికల్ గా జరక్కపోయినా ఓటిటిలో ఆ ముచ్చట తీరింది. నిన్నటి నుంచి సోని లివ్ లో రేఖా చిత్రం బహు భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ రేఖా చిత్రంలో అంత గొప్పగా ఏముందో చూద్దాం.
రాజేంద్రన్ (సిద్ధికి) అనే ధనవంతుడు ఒక అడవిలోకి వెళ్లి ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య చేసుకుంటాడు. స్నేహితులతో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని హత్య చేసి పూడ్చి పెట్టడమే కారణంగా చెబుతాడు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి పూనుకుంటాడు ఎస్ఐ వివేక్ (అసిఫ్ అలీ). దొరికిన వివరాల ప్రకారం తవ్వి చూడగా 1985లో కనిపించకుండా పోయిన రేఖా (అనస్వర రాజన్) మృతదేహమని తేలుతుంది. జూనియర్ ఆర్టిస్ట్, మమ్ముట్టి వీరాభిమానిగా ఇండస్ట్రీకి వచ్చిన రేఖ అసలెందుకు హత్యకు గురయ్యింది, దాని వెనుక దిగ్భ్రాంతి కలిగించే హంతకులు ఎవరనేది అసలు స్టోరీ.
దర్శకుడు జోఫీన్ టి చాకో తీసుకున్న పాయింట్ రెగ్యులర్ క్రైమే అయినప్పటికీ దానికి మమ్ముట్టి పాత సినిమా షూటింగ్ నేపధ్యాన్ని జోడించడం రేఖా చిత్రంకి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. మల్లువుడ్ సినిమాల్లో సాధారణంగా చూసే ల్యాగ్ ఇందులోనూ కనిపిస్తుంది. కాకపోతే అసలు విలన్ ఎవరనేది ఊహించకుండా, సరైన సమయంలో ట్విస్టులను విప్పుకుంటూ వెళ్లిన విధానం బాగుంటుంది. అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించే రేంజ్ లో స్క్రీన్ ప్లే ఉండదు కానీ ఆసక్తి తగ్గకుండా నడిపించడంలో సక్సెసయ్యింది. ఆర్టిస్టుల నటన పెద్ద ప్లస్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకు ఓకే కానీ సగటు ఆడియన్స్ కి మరీ ఎగ్జైట్ మెంట్ అనిపించదు.
This post was last modified on March 7, 2025 5:03 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…