సూర్య హీరోగా ఆర్జె బాలాజీ దర్శకత్వంలో ఒక ఫాంటసీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిన్న కోటి రూపాయల పూజ ఖర్చుతో మొదలైన నయనతార మూకుతి అమ్మన్ 2 (అమ్మోరు తల్లి) కి మొదట అనుకున్నది బాలాజీనే. అయితే నిర్మాతతో ఏవో అభిప్రాయభేదాలు రావడంతో దాన్ని వదిలేసి బయటికొచ్చి సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. రెండింటి మధ్య సారూప్యతలు ఉండే అవకాశం ఉందని చెన్నై టాక్. ముందు ఏది రిలీజైతే దానికి అడ్వాంటేజ్ ఉంటుందని, ఒకవేళ కంటెంట్ లో పోలికలు వస్తే కోర్టు వివాదాలు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక అసలు పాయింటుకొద్దాం.
సూర్య 45 స్టోరీ బ్యాక్ డ్రాప్ పదేళ్ల క్రితం వచ్చిన వెంకటేష్ పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’కు దగ్గరగా ఉంటుందని సమాచారం. ఇది బాలీవుడ్ హిట్ మూవీ ఓ మై గాడ్ రీమేకనేది విదితమే. ఇప్పుడు సూర్య చేస్తున్న సినిమాలో డ్యూయల్ రోల్ ఉంటుందట. ఒకటేమో దేవుడు. రెండోది లాయర్. దైవం అనుకోని పరిస్థితుల్లో భూమి మీదకు వచ్చినప్పుడు అతని తరఫున వాదించే బాధ్యత ఓ న్యాయవాది మీద పడుతుంది. అప్పుడు ఏర్పడే డ్రామా మీద బాలాజీ ఇచ్చిన నెరేషన్ ఇంత పెద్ద బడ్జెట్ పెట్టేలా చేసిందని ఇన్ సైడ్ టాక్. అంటే వెంకీ, పవన్ తరహా క్యారెక్టర్లను సూర్య (దేవుడు, లాయర్) ఒక్కడే చేస్తాడన్న మాట.
ఇది అధికారికంగా వచ్చిన వార్త కాకపోయినా లీకులను లింక్ చేస్తుంటే ఇదే తేలుతోంది. నయనతార అమ్మోరు తల్లి 2లోనూ ఇంచుమించు గాడ్ వర్సెస్ హ్యూమన్ పాయింట్ మీదే దర్శకుడు సి సుందర్ కొత్త కథ రాసుకున్నాడట. మాములుగా యముడు భూలోకంకు వచ్చి నాటకీయతను సృష్టించడం చాలాసార్లు చూశాం. అయితే దేవుడు వచ్చి ఫుల్ లెన్త్ సినిమాని నడిపించడం అప్పుడెప్పుడో రావుగోపాల్ రావు మా ఊళ్ళో మహాశివుడుతో మొదలైంది. తర్వాత గోపాల గోపాల దాకా వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ తో చేస్తున్న రెట్రో విడుదల తర్వాత సూర్య 45 తాలూకు ప్రమోషన్లు మొదలవ్వబోతున్నాయి.
This post was last modified on March 7, 2025 4:04 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…