బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సి 16 షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో సుకుమార్ తో ప్లాన్ చేసుకున్న ఆర్సి 17 పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం క్యాస్టింగ్ మీద దృష్టి పెట్టిన టీమ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిమీద మల్లగుల్లాలు పడుతోందని సమాచారం. ఒక ఆప్షన్ గా సమంత పేరుని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురి కాంబోలో రంగస్థలం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మళ్ళీ చెప్పనక్కర్లేదు. చిట్టిబాబు, రామలక్ష్మి కెమిస్ట్రీని క్లాసు మాస్ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు. ఆ మాటకొస్తే ఈ జంటను మరిపించే మేజిక్ మరో దర్శకుడు చరణ్ కు ఇవ్వలేదు.
అందుకే సామ్ అయితే ఎలా ఉంటుందనే కోణంలో సుకుమార్ సీరియస్ గా ఆలోచిస్తున్నారట. కాకపోతే సినిమాలు చేయడం తగ్గించేసిన సమంత బ్రాండ్ ప్యాన్ ఇండియా స్థాయిలో ఏ మేరకు ఉపయోగపడుతుందనేది విశ్లేషించుకోవాలి. పుష్పలో ఐటెం సాంగ్, సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా పాపులారిటీ విషయంలో సామ్ ముందంజలోనే ఉంది కానీ ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవేళ నిజంగా సుకుమార్ అడిగితే మాత్రం నో అనకపోవచ్చు. ప్రస్తుతానికీ వార్త చక్కర్లయితే కొడుతోంది కాబట్టి సుకుమార్ మనసులో ఎవరున్నారో ఆయనగా చెబితే తప్ప ఇప్పట్లో బయటికి రాదు.
మరో ఆప్షన్ గా రష్మిక మందన్నని చూస్తున్నారట కానీ ఎంతమేరకు నిజమవుతుందో చెప్పలేం. ఇప్పటికైతే సుకుమార్ తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒకవేళ బుచ్చిబాబు సినిమా కనక అక్టోబర్ లోగా అయిపోతే కనీసం జనవరి నుంచి ఆర్సి 17 సెట్స్ పైకి తీసుకెళ్లాలి. గేమ్ ఛేంజర్ కోసం విలువైన మూడేళ్ళ కాలాన్ని వృథా చేసుకున్న రామ్ చరణ్ ఈసారి అలా రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎక్కువ గ్యాప్ లేకుండా వేగంగా సినిమాలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. సుకుమార్ స్టయిల్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది కాబట్టి త్వరగా మొదలుపెట్టాలనేది ప్లాన్.
This post was last modified on March 7, 2025 10:20 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…