సౌత్ హీరోల మాస్ సినిమాల్లో హీరోయిజం ఏ లెవెల్లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లు ఒక దెబ్బ కొడితే రౌడీ వెళ్లి పది మీటర్ల అవతల పడాల్సిందే. గాల్లో తేలిపోవాల్సిందే. గోడలు సైతం బద్దలు కావాల్సిందే. ‘వర్షం’ సినిమాలో ప్రభాస్ ఏకంగా చేతి బోరును పీకి విలన్ మీదికి దూసుకెళ్లిపోతాడు. అది చూసి ఇదెలా సాధ్యం అనుకోలేదు మన ప్రేక్షకులు. వారెవా ఏం హీరోయిజం అనే అనుకున్నారు.
ఇలా హీరోలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విన్యాసాలు చేస్తూనే ఉండాలి. చేతుల్లోకి కొత్త కొత్త ఆయుధాలు తీసుకుని విలన్ల మీదికి దూసుకెళ్లిపోవాలి. తాజాగా తెలుగు వాళ్లకు బాగా పరిచయమున్న తమిళ కథానాయకుడు కార్తి ఇప్పటిదాకా ఎవ్వరూ పట్టని ఆయుధాన్ని చేతికి తీసుకున్నాడు. విద్యుత్ ప్రవహించే హై టెన్షన్ వైర్‌ను అతను చేతికి తీసుకోవడం విశేషం.
గత ఏడాది ‘ఖైదీ’తో మెప్పించిన కార్తి.. దాని తర్వాత భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ‘సుల్తాన్’ అనే సినిమా మొదలుపెట్టాడు. ప్రముఖ తమిళ నిర్మాత ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ రోజే ఫస్ట్ లుక్ లాంచ్ చేశాడు. ఇందులో కార్తి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ తరం నగర కుర్రాళ్లకు ప్రతినిధిలా కనిపిస్తున్న కార్తి సీరియస్‌గా చూస్తూ హై టెన్షన్ వైర్‌ను చేత్తో పట్టుకుని ఉన్నాడు. వెనుక కరెంటు పోల్స్ కనిపిస్తున్నాయి. మరీ విలన్లను కొట్టడానికి ఇలాంటి ఆయుధమా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు కానీ.. మాస్‌ను ఆకట్టుకోవాలంటే ఇలాంటివే అవసరం. ‘సుల్తాన్’ను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు నిర్మాత. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కన్నడ అమ్మాయి రష్మిక మందన్నా ఈ చిత్రంతోనే తమిళంలో అడుగు పెడుతుండటం విశేషం.
This post was last modified on October 26, 2020 7:10 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు.…
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…