Movie News

నితిన్ సినిమా అప్‌డేట్.. హరీష్ శంకర్ ఎగ్జైట్మెంట్

టాలీవుడ్లో చాన్నాళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా.. యల్లమ్మ. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ వేణు రూపొందించనున్న రెండో చిత్రమిది. ‘బలగం’ రిలీజైన కొన్ని నెలలకే ఈ సినిమా తెరపైకి వచ్చింది. నాని హీరోగా ఈ సినిమా తీయడానికి వేణు రంగం సిద్ధం చేసుకున్నాడు. నిర్మాత దిల్ రాజు సైతం ఈ సినిమాను కన్ఫమ్ చేశాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఈ సినిమా ముందుకు కదల్లేదు. నాని స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందకపోవడమే కారణమని భావించారు. అంతటితో సినిమా అటకెక్కేస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత నితిన్ పేరు తెరపైకి వచ్చింది. దిల్ రాజు బేనర్లోనే ఈ యంగ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు వేణు. ఎట్టకేలకు ఆ సినిమా పట్టాలెక్కబోతోంది. మరి కొన్ని రోజుల్లోనే చిత్రీకరణ ఆరంభం కానుంది.

ఈ నేపథ్యంలో ‘యల్లమ్మ’ మూవీ గురించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటికి వచ్చింది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారట. ఆ స్థాయి సంగీత దర్శకులు.. వేణు డైరెక్ట్ చేయబోయే సినిమాకు పని చేయడం అంటే చాలా పెద్ద విశేషమే. ఈ అప్‌డేట్ బయటికి రాగానే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఎగ్జైట్మెంట్‌తో ఒక పోస్ట్ పెట్టాడు. దర్శకుడిగా హరీష్ తొలి చిత్రం ‘షాక్’కు అజయ్-అతుల్ పని చేశారు. డిజాస్టర్ అయిన ఆ సినిమాలో ‘మధురం మధురం’ పాట పెద్ద హిట్ అయింది. ఆ పాటను కంపోజ్ చేసింది ఈ సంగీత దర్శక ద్వయమే.

ఈ విషయం గుర్తు చేసుకుంటూ నోస్టాల్జిక్‌గా ఫీలయ్యాడు హరీష్. మళ్లీ ఇంత కాలానికి వాళ్లిద్దరూ ఓ తెలుగు సినిమాకు పని చేస్తుండడం.. పైగా హరీష్ సొంత బేనర్‌లా ఫీలయ్యే ఎస్వీసీ సంస్థలో రూపొందబోయే చిత్రం కావడం తన ఎగ్జైట్మెంట్‌కు కారణం కావచ్చు. మ్యూజిక్ గురించి ఈ అప్‌డేట్‌తో ‘యల్లమ్మ’కు మంచి హైప్ వస్తుందనడంలో సందేహం లేదు.

This post was last modified on March 6, 2025 5:55 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

3 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

4 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

4 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

4 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

7 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

7 hours ago