గత ఏడాది ‘క’ రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి దిల్ రుబాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వాస్తవానికి ప్రేమికుల రోజు కానుకగా గత నెలే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ పలు కారణాల వల్ల వాయిదా వేసి హోలీ పండక్కు తెస్తున్నారు. టీజర్, పాటలు ఇప్పటికే అంచనాలు రేపగా తాజాగా ట్రైలర్ రూపంలో కంటెంట్ ఎలా ఉండబోతోందో పరిచయం చేశారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ లవ్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ లో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించగా సామ్ సిఎస్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇంతకీ కథేంటో చూద్దాం.
మంగళూరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే సిద్దు (కిరణ్ అబ్బవరం) కు ఆవేశమెక్కువ. గతంలో ప్రేమించిన అమ్మాయే లెక్చరర్ గా వచ్చినా చలించకుండా తన పని తాను చేసుకుపోయే రకం. కొత్తగా మ్యాగీ (రుక్సర్ ధిల్లాన్) లవ్ లో పడతాడు. కానీ ఒక బైక్ విషయంలో తలెత్తిన గొడవ వల్ల సిద్దు, మ్యాగీలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుంది. చేయని తప్పుకు సారీ చెబితే అయిపోతుంది కానీ సిద్దు మనస్తత్వం దానికి ఒప్పుకోదు. దీంతో సమస్య జఠిలంగా మారి కొత్త ప్రమాదాలు తీసుకొస్తుంది. ఇంట్లో వాళ్ళను రిస్క్ లో పెడుతుంది. ఇంతకీ అతను చిక్కున్న పద్మవ్యూహం ఏంటనేది మార్చి 14 చూడాలి.
రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా దర్శకుడు విశ్వ కరుణ్ విభిన్నంగా ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ప్రేమకథగా మొదలుపెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకొచ్చి దానికి మళ్ళీ ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి ఆల్ ఇన్ వన్ ప్యాకేజీ ఇచ్చాడు. కిరణ్ అబ్బవరం పాత్రలో ఎక్కువ షేడ్స్ తో పాటు డెప్త్ ని పెట్టారు. దానికి తగ్గట్టే నటనలో డోస్ పెరిగినట్టు అనిపిస్తోంది. నాని నిర్మించిన కోర్ట్, మలయాళం డబ్బింగ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీలతో పోటీ పడబోతున్న దిల్ రుబా కనక యూత్ కి కనెక్ట్ అయితే కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్టు పడ్డట్టే. చూడాలి మరి మాస్ ప్రేమికుడి బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతోందో.
This post was last modified on March 6, 2025 5:41 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…